వికారాబాద్‌లో రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

Submitted on 16 April 2019
Four dead at Road accident in Vikarabad

వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ...ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శ్రీరామ నవమి రెండో రోజు ఏప్రిల్ 15 సోమవారం జుంటుపల్లి సీతారామ ఆలయంలో జరిగిన వేడుకల్లో తాండూరుకు చెందిన కొందరు భక్తులు పాల్గొన్నారు.
Read Also : ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలపై సుప్రీంకోర్టులో పిటిషన్

అనంతరం తిరిగి ఆటోలో ఇంటికి వస్తుండగా మార్గంమధ్యంలో రాత్రి యాలాల మండలం దౌలాపూరు శివారులో వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో తాండూరు బండప్పబావికి చెందిన తల్లీకుమార్తెలు భారతమ్మ (50), తుల్జమ్మ (35), సాయిపురానికి చెందిన అనంతయ్య (53), ఆయన భార్య లక్ష్మి (45) మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ ఆశప్ప, చిన్నారి శశికళ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
Read Also : మహిళను ఈడ్చుకెళ్లిన మెట్రో రైలు : తలకు తీవ్రగాయాలు

FOUR
Dead
road accident
Vikarabad
auto
Lorry


మరిన్ని వార్తలు