రూ.5కోట్లు దోచేశాడు : ఉద్యోగాల పేరుతో మాజీ ఐఏఎస్ మోసం

Submitted on 15 March 2019
Former TN IAS officer arrested for job fraud of Rs 5 crore

చెన్నై: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి వారి నుంచి రూ.5కోట్లు దోచేసిన మాజీ ఐఏఎస్ చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఈ ఘటన జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నమ్మించాడు. వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇలా 106 మందిని దగా చేశాడు. మొత్తం రూ.5కోట్లు వసూలు చేశాడు. భారీ చీటింగ్ కు పాల్పడి పరారీలో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 13న అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: బాత్రూంలో ఏం జరిగింది : వివేకానందరెడ్డి మృతిలో 5 అనుమానాలు

మోహన్ రాజ్.. తమిళనాడు రవాణశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారు. ఆ సమయంలో నాగప్పన్ అనే వ్యక్తితో కలిసి ఫ్రాడ్ కు పాల్పడ్డారు. రవాణశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి  నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశారు. నుంగంబాక్కమ్ కు చెందిన నిసార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో మోహన్ రాజ్ బండారం బట్టబయలైంది. 2013 లో నిసార్ కూతురికి మెడికల్ సీటు  ఇప్పిస్తానని మోహన్ రాజ్ అతడి నుంచి రూ.50లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ సీటు ఇప్పించలేదు.

దీంతో అనుమానం వచ్చిన నిసార్.. తన డబ్బు వెనక్కి ఇచ్చేయాలని మోహన్ రాజ్ పై ఒత్తిడి  తెచ్చాడు. అయినా వెనక్కి ఇవ్వలేదు. దీంతో నిసార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోహన్ రాజ్ ఐఏఎస్ అధికారి కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. నిసార్ ఈసారి హైకోర్టుని  ఆశ్రయించాడు. మోహన్ రాజ్ మోసం చేశాడని ఫిర్యాదు చేశాడు. అతడి పిటిషన్ విచారించిన కోర్టు.. వెంటనే మోహన్ రాజ్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశంతో 2015లో పోలీసులు కేసు నమోదు చేశారు.

2017లో మోహన్ రాజ్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. చివరికి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మోహన్ రాజ్ తో పాటు మరో చీటర్ నాగప్పన్ ను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఉద్యోగాల పేరుతో మోసం చేశారని, తిరువణ్ణామలైలో వీరిపై జాబ్ ఫ్రాడ్ కేసు నమోదైందని చెప్పారు. ఇద్దరూ కలిసి 106 మందిని మోసం చేశారని, వారి నుంచి రూ.5కోట్లు దోచుకున్నారని వివరించారు.
Read Also: నిలువునా దోచేస్తున్నారు : బుక్‌ మై షో, పీవీఆర్ చీటింగ్‌ బట్టబయలు

Former
TN
IAS
arrested
job fraud
Mohanraj
cheat

మరిన్ని వార్తలు