మహాతల్లి : బిడ్డను మర్చిపోయి.. విమానం ఎక్కి వెళ్లింది

Submitted on 12 March 2019
Flight You Turn: Forget the baby in the airport and flight to the flight

ప్రయాణం చేసే సమయంలో మనం పట్టికెళ్లే బ్యాగులు ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటాం. అన్నీ వచ్చాయో లేదో అస్తమాను చూసుకుంటునే ఉంటారు. అంత జాగ్రత్త ఉంటాం. లగేజ్ విషయంలోనే అంత కేర్ ఫుల్ గా ఉన్నప్పుడు.. పసిబిడ్డల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటారు. ఈ మహాతల్లి మాత్రం అందుకు భిన్నం. ఓ మహిళ మాత్రం పసిబిడ్డను మరచిపోయి విమానం ఎక్కేసింది. టేకాఫ్ తర్వాత బిడ్డ సంగతి గుర్తుకొచ్చింది. అంతే పెద్ద పెద్దగా కేకలు వేసింది. విషయాన్ని చెప్పింది.

ఆ తల్లి చెప్పిన మాటలతో విమానంలోని ప్రయాణికులు కూడా షాక్ అయ్యారు. వెంటనే పైలెట్లకు సమాచారం ఇచ్చారు. ఆయన ఎయిర్ పోర్ట్ అధికారులతో మాట్లాడారు. వెయిటింగ్ హాల్‌లో.. ఓ శిశువు ఉందని.. ఆమె తల్లి విమానంలో ఉందని తెలిపారు. వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని మళ్లీ వెనక్కి రప్పించారు. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన.
 

విషయం విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ఏటీసీ)కి సమాచారం అందించారు. ఫ్లైట్‌ను వెనక్కి తిప్పారు. పైలట్ చెప్పిన విషయం విన్న ఏటీసీ ఆశ్చర్యపోయింది. అనంతరం విమానం వెనక్కి రావడానికి అనుమతి ఇచ్చింది. ల్యాండయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏటీసీతో పైలట్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Saudi Arabia
King Abdullaziz
International Airport
mother
Just Barn Baby
forgot

మరిన్ని వార్తలు