'రణరంగం' ఫస్ట్ లుక్

Submitted on 25 May 2019
 First Look of  Ranarangam

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా, సుధీర్ వర్మ దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా.. 'రణరంగం'.. ఇప్పటి వరకు 'దళపతి' టైటిల్ ప్రచారంలో ఉంది.. ఆ టైటిల్ ఇంకొకరు రిజిస్టర్ చేసుకోవడంతో 'రణరంగం' అనే పేరుని ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

అక్కడక్కడా తెల్ల వెంట్రుకలతో ఉన్న జుట్టు, గెడ్డం, నోట్లో పొగలు కక్కుతున్న సిగార్‌తో శర్వానంద్ లుక్ బాగుంది. రణరంగంలో శర్వా క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉంటాయని, గ్యాంగ్స్టర్‌‌ గానూ కనిపించనున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ ఫస్ట్ లుక్ చూస్తే ఆ వార్తలు నిజమే అనిపిస్తుంది. శర్వా తన మనుషులతో క్వారీ లాంటి ప్లేస్‌లో నడుచుకుంటూ వస్తుండగా టైటిల్ రివీల్ చెయ్యడం బాగుంది. ప్రశాంత్ ఆర్ఆర్ హైలెట్‌గా నిలిచింది. కథ రీత్యా ఈ టైటిల్ యాప్ట్ అవుతుందని నిర్మాత చెప్పాడు. ఇప్పటి వరకు 75శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఆగస్ట్ 2న రణరంగం రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం : ప్రశాంత్ పిళ్లై, కెమెరా : దివాకర్ మణి, ఎడిటింగ్ : నవీన్ నూలి, సమర్పణ : పిడివి ప్రసాద్..

Sharwanand
Kajal Aggarwal
Kalyani Priyadarshan
Sithara Entertainments
sudheer varma

మరిన్ని వార్తలు