‘ది బాడీ’ ఫస్ట్ లుక్ : డిసెంబర్ 13 రిలీజ్

Submitted on 8 November 2019
First Look Poster of ‘The Body’

ఇమ్రాన్ హష్మీ, రిషి కపూర్, వేదిక, శోభిత ధూలిపాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘ది బాడీ’.. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది.. మలయాళం ‘దృశ్యం’తో ఆకట్టుకున్న జీతూ జోసెఫ్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు..

కొంత విరామం తర్వాత రిషి కపూర్ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు.. ఇప్పడు ‘ది బాడీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.. సినిమాపై ఆసక్తి పెంచేలా, థ్రిల్‌కి గురిచేసేలా ఉందీ పోస్టర్..

Read Also : బాలీవుడ్ హారర్ బ్రదర్స్ బయోపిక్ వస్తోంది!

గ్లాస్‌లో నుంచి రక్తం ఒలకడం, పక్కనే రెండు ఉంగరాలు, పాయిజన్ బాటిల్, మిస్ యూ జాన్ అని రాసి ఉన్న చిన్న పేపర్, ఓ సెల్‌ఫోన్ ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపిస్తున్నాయి.. ఈ సినిమాను కేవలం 39 రోజుల్లో పూర్తి చేయడం విశేషం. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఓ స్పానిష్ సినిమా ఆధారంగా తెరకెక్కుతుంది. డిసెంబర్ 13న ‘ది బాడీ’ విడుదల కానుంది.. 

Emraan Hashmi
Rishi Kapoor
Vedhika
Sobhita Dhulipala
Jeethu Joseph

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు