కౌసల్య కృష్ణమూర్తి : మోషన్ పోస్టర్

Submitted on 24 May 2019
First Look and Motion Poster of Kausalya Krishnamurthy

తమిళ స్టార్ శివ కార్తికేయన్ కీలక పాత్రలో నటించిన సినిమా కణ.. ఐశ్వర్య రాజేష్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమా రీమేక్ కానుంది. శుభమస్తు (1995) నుండి సిల్లీఫెలోస్ (2019) వరకు పలు రీమేక్స్ తెరకెక్కించిన భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో, క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్.రామారావు సమర్పణలో, కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'కౌసల్య కృష్ణమూర్తి' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. 'ది క్రికెటర్' అనేది ట్యాగ్ లైన్..

చిత్ర విశేషాలను వెల్లడిస్తూ, ఫిలిం చాంబర్‌లో కౌసల్య కృష్ణమూర్తి ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్  ఈ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది. ఐశ్వర్య, నటుడు రాజేష్ కూతురు.. తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పాతిక సినిమాల వరకు చేసింది. ఒరిజినల్ వెర్షన్‌లో చేసిన క్యారెక్టర్‌నే ఆమె ఈ సినిమాలోనూ చేస్తుండగా, శివ కార్తికేయన్ అతిథి పాత్ర పోషించాడు. ఓ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యువతి అంతర్జాతీయ క్రికెటర్ కావాలనే లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? అనేదే పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్ హైలెట్ అవుతుందని, ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిందని నిర్మాత తెలిపాడు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, ఝాన్సీ, సివిఎల్ నరసింహరావు, కార్తీక్ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కెమెరా : ఐ. ఆండ్రూ, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, సంగీతం : ధిబు నైనన్ థామస్, కథ : అరుణ్ రాజా కామరాజ్, డైలాగ్స్ : హనుమాన్ చౌదరి, ఆర్ట్ : ఎస్ శివన్.

Aishwarya Rajessh
Sivakarthikeyan
Dhibu Ninan Thomas
K.A.Vallabha
Bheemaneni SrinivasaRao

మరిన్ని వార్తలు