ఆదిత్య వర్మ ఫస్ట్‌లుక్

Submitted on 19 February 2019
First Look of Adithya Varma Remake of Arjun Reddy-10TV

చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్‌ని హీరోగా పరిచయం చేస్తూ, విలక్షణ దర్శకుడు బాలా దర్శకత్వంలో, తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన అర్జున్ రెడ్డి‌ని, వర్మ పేరుతో రీమేక్ చేసారు. కొంత భాగం షూటింగ్ చేసాక, బాలా పనితీరు నచ్చక, ప్రాజెక్ట్ ఆపేసి, మళ్ళీ ఫ్రెష్‌గా షూటింగ్ స్టార్ట్ చేసారు. గిరీసయ్య డైరెక్ట్ చేస్తుండగా, అక్టోబర్ ఫేమ్ బనిటా సంథు, ప్రియా ఆనంద్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఆదిత్య వర్మ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సందర్భంగా ధృవ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసారు. ఫుల్ హెయిర్, గెడ్డంతో రఫ్ లుక్‌లో ధృవ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి కెమెరా : రవి కె చంద్రన్, సంగీతం : రథన్. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో షాహిద్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ షెట్టి డైరెక్ట్ చేస్తుండగా, కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది.

Dhruv Vikram
Banita Santhu
Priya Anand
Radhan
Gireesaaya

మరిన్ని వార్తలు