సెల్ఫీ ప్లీజ్ : ఎయిర్ పోర్ట్ లో షార్క్.. ప్రయాణీకులు షాక్ 

Submitted on 22 March 2019
The first landing landing at the Indira Gandhi International Airport in Delhi, with the shark fish theme

నీటిలో ఉండే షార్క్ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. వణికిపోతారు కదూ. అటువంటి భయానికి గురయ్యారు దాన్ని చూసినవారంతా. షార్క్ చేప ఆకారంలో ఉన్న ఓ విమానం ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. దీన్ని చూసినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. షార్క్  చేప రూపంలో తయారుచేసిన ఓ విమానం అని తెలిసి ఊపిరి తీసుకున్నారు. దీంతో వెంటనే సెల్ఫీలు తీసుకునే  హడావిడిలో బిజీ అయిపోయారు. ఈ షార్క్ విమానం అసలు కథ ఏమిటంటే..

బ్రెజిల్ కు చెందిన ఎంబ్రాయర్ అనే విమానాలు తయారు చేసే సంస్థ షార్క్ చేప  థీమ్‌తో విమానాన్ని తయారు చేసింది. ఆ విమానం మంగళవారం (మార్చి 14)న ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా ల్యాండైంది. దీన్ని చూసివారంతా నోరెళ్లబెడుతున్నారు. అంతేకాదు సెల్ఫీల పిచ్చి ఉన్నవారు విజృంభించారు. రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

బ్రెజిల్‌కు చెందిన ఈ ఎంబ్రాయర్ E190-E2 కమర్షియల్ జెట్‌ విమానం ఎంతో ప్రత్యేకమైనది. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన సీట్లను ఈ విమానంలో ఏర్పాటు చేశారు. కాగా షార్క్ చేప రూపంలోనే కాక..పులి, గ్రద్ద ముఖాలతో కూడా ఈ విమానం మోడళ్లను రూపొందించారు ఎంబ్రాయర్ సంస్థ. ఇంధనం ఆదా చేసే ఈ విమానాన్ని తక్కువ ధరలకే అందుబాటులోకి తెస్తామని ఎంబ్రాయర్ నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ విమానం ఇండియాలో ఎప్పుడు.. ఎక్కడ నుంచి ఎక్కడికి సేవలను అందిస్తుందనేది మాత్రం  వెల్లడించలేదు ఎంబ్రాయర్ నిర్వాహకులు.  సోషల్ మీడియాలో ఈ విమానాన్ని చూసిన  నెటిజన్లను ఎంజాయ్ చేస్తున్నారు. 
Read Also : నాకేం తక్కువ : రెండు కాళ్లతోనే నడుస్తున్న బుజ్జి మేక

The Shark Theme
Delhi
Indira Gandhi International Airport
Brazil-based Empire E190-E2
Commercial
Jet Aircraft

మరిన్ని వార్తలు