సూరత్‌లో మహా విషాదం : ప్రాణాల కోసం బిల్డింగ్ పైనుంచి దూకి.. చనిపోయిన స్టూడెంట్స్

Submitted on 24 May 2019
A fire broke out on the second floor of a building in Sarthana area of Surat

గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో స్టూడెంట్స్ చనిపోవటం విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా భారీ ఎత్తున చెలరేగిన మంటలతో.. స్టూడెంట్స్ పరుగులు తీశారు. బిల్డింగ్ లో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం, ఒక్కసారిగా బయటకు రావటానికి ప్లేస్ లేకపోవటం కూడా మృతుల సంఖ్య పెరగటానికి కారణం అయ్యింది.

దీనికితోడు బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి కింద రావాలని ప్రయత్నించిన స్టూడెంట్స్.. మొదటి అంతస్తు, సెల్లార్ లోనూ భారీగా వ్యాపించిన మంటలతో బయటకు రావటం సాధ్యం కాలేదు. ఇదే సమయంలో కొంత మంది స్టూడెంట్స్.. ప్రాణాలు కాపాడుకునేందుకు రెండో అంతస్తులోని కిటికీ అద్దాలు పగులగొట్టి మరీ బయటకు దూకారు. స్టూడెంట్స్ కు సపోర్ట్ గా ఉన్న సైన్ బోర్డులు, ఫ్లోర్ల మధ్య ఉన్న ఇనుప కడ్డీలు తగిలి నలుగురు పిల్లలు చనిపోయారు.

కళ్ల ముందు స్టూడెంట్స్ బిల్డింగ్ పైనుంచి దూకుతుంటే.. కింద ఉన్న వారు కాపాడేందుకు ఎంతో ప్రయత్నించారు. అయితే బిల్డింగ్ చుట్టూ వ్యాపించిన మంటలు, కాపాడటానికి సరైన పరికరాలు లేకపోవటంతో నలుగురు పిల్లలు కళ్ల ముందు చనిపోవటం మరింత విషాదం.
 

fire
second floor
building
Sarthana
Surat
Students

మరిన్ని వార్తలు