పెట్రోల్ ట్యాంకర్ కు మంటలు

Submitted on 27 May 2019
Fire broke out in an oil tanker on the Goregaon bridge today

ముంబై : ముంబై లోని గోరే గావ్ ఫ్లై ఓవర్ పై ప్రయాణిస్తున్న ఓ పెట్రోలు  ట్యాంకర్ మంటల్లో చిక్కుకుంది. సోమవారం ఉదయం వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే పై ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్ పెట్రోలియం కు చెందిన ట్యాంకర్ ఫ్లై ఓవర్ పైకి  చేరుకోగానే డ్రైవర్ క్యాబిన్ లో నుంచి  మంటలు మొదలయ్యాయి.  మంటలు క్రమంగా ట్యాంకర్ అంతటికీ వ్యాపించటంతో  అంధేరీ నుంచి గోరేగావ్ వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పెట్రోలుతో నిండి ఉన్నట్యాంక్ వైపు మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్‌ ట్యాంకర్‌  అగ్నిప్రమాదానికి గురైన   దృశ్యాన్ని  వీడియో చేసిన స్ధానికులు  ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

petrol tanker
catches fire
Mumbai
 

మరిన్ని వార్తలు