దసరా వేడుకల్లో ప్రమాదం : బాణాసంచా నిప్పురవ్వలు పడి టీవీ షోరూం దగ్దం.. రూ.50లక్షలు నష్టం

Submitted on 9 October 2019
Fire Accident in tv show room

దసరా సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో అపశ్రుతి జరిగింది. ఊరేగింపులో భాగంగా బాణసంచా కాల్చడంతో నిప్పు రవ్వలు ఎగసిపడి ఓ గోదాంలోని అట్టపెట్టెలపై పడ్డాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో మంటలు వ్యాపించి గోదాం దగ్ధమైంది. కడప పట్టణం గోకుల్ లాడ్జి వీధిలోని ఓ టీవీ షోరూం గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో రూ.50లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిసి గోదాం సమీపంలోని పాత అట్టపెట్టలపై పడ్డాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అప్పటికే గోదాంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలాన్ని డీఎస్సీ పరిశీలించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఊహించని విధంగా ప్రమాదం జరగడంతో అంతా షాక్ తిన్నారు.

kadapa
Fire Accident
crackers
dasara
tv showroom
TV
ACs
fridges

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు