తప్పిన ప్రమాదం : TSRTC బస్సులో మంటలు

Submitted on 21 February 2019
Fire Accident In TSRTC Volvo Bus

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర పెను ప్రమాదం తప్పింది. TSRTC వోల్వో బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపేసి ప్రయాణికులను దింపేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికులు సేఫ్‌గా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి కొంత దూరం వెళ్లిన వెంటనే జూపూడి దగ్గర ఇంజిన్‌లో మంటలు చెలరేగిన విషయాన్ని స్థానికులు గుర్తించారు. వారు వెంటనే డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల ఇళ్ల నుంచి పైపులు వేసి ఆ నీటితో మంటలను ఆర్పివేశారు. కాసేపటి తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. బస్సు హైవే మీదకు వెళ్లిపోయి ఉంటే.. నీరు అందుబాబులో ఉండేది కాదని ఘోర ప్రమాదం జరిగి ఉండేదని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం కూడా జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్ష్యులు అంటున్నారు.

Fire Accident
tsrtc volvo bus
Krishna District
Ibrahimpatnam
jupudi
passengers safe

మరిన్ని వార్తలు