ఢిల్లీ హోటల్ లో అగ్ని ప్రమాదం : 17 మంది మృతి 

Submitted on 12 February 2019
Fire Accident At Delhi : 10 deaths

ఢిల్లీ : ఢిల్లీలోని కరోల్ బాగ్ లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్ లో ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఫైర్ యాక్సిడెంట్ లో 17 మంది చనిపోయారు. ఇద్దరు అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ టెర్రస్ పైనుంచి దూకారు. తీవ్రగాయాలతో చనిపోయారు. చనిపోయిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.  కేరళ రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మంటల్లో చనిపోయారు.

25 మందిని అగ్నిమాపక సిబ్బంది హోటల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. తెల్లవారుజాము నాలుగున్నర గంటల సమయంలో ప్రమాదం జరగటంతో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ టైంలో మంటలు వ్యాపించటంతో మృతుల సంఖ్య పెరిగింది. గాఢనిద్ర.. చుట్టూ మంటలు, కరెంట్ లేదు.. ఏం జరుగుతుందో తెలియలేదు. తప్పించుకునే మార్గం కూడా తెలియక చాలా మంది చనిపోయారు. మంటల్లో ఊపిరిఆగడ కొంత మంది చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. హోటల్ టెర్రస్ పైనుంచి వ్యాపించిన మంటలు.. కింద ఫ్లోర్లలోని గదులకు వ్యాపించాయి. దీంతో ప్రమాదం తీవ్రంగా ఎక్కువగా ఉందని హోటల్ యాజమాన్యం వెల్లడించింది. ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.

Delhi
Fire Accident
Karol Bagh
Hotel Arpit Palace.

మరిన్ని వార్తలు