ఎట్టకేలకు సొంతూరుకు: చైనాలో చిక్కుకున్న మనోళ్లు తిరిగొచ్చారు!

Submitted on 19 February 2020
Finally telugu students reach vizag from wuhan City over China coronavirus outbreak 

డ్రాగన్ దేశమైన చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో భారతీయులు చాలామంది అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశానికి వెళ్లేందుకు అక్కడి అధికారులు నిరాకరించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టేకేలకు తెలుగు విద్యార్థులను సొంతూళ్లుకు అధికారులు పంపించారు. covid-19 వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా భయాందోళన నెలకొంది. చైనాలో రోజురోజుకీ కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది.

వేలాదిమందికి వైరస్ సోకడంతో ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలోని వుహాన్‌‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఎట్టకేలకు సొంతూళ్లకు పంపించారు. చైనాలో ట్రైనింగ్ కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులు కరోనా వైరస్ వ్యాప్తితో అక్కడే చిక్కుకుపోయారు.

ఈ నెల 3న ప్రత్యేక విమానంలో చైనా నుంచి 58 మంది భారతీయులను ఢిల్లీకి తీసుకొచ్చారు. వారిని అక్కడ 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచారు. అయితే వారిలో ఎవరికి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. తెలుగు విద్యార్థులను మంగళవారమే సొంతూళ్లకు పంపించేశారు.

విశాఖకు చెందిన 9 మంది పీవో టీపీఎల్‌ ట్రైనీ విద్యార్థులు విశాఖకు చేరుకున్నారు. కరోనా వ్యాప్తితో తమ పిల్లలు ఎలా ఉన్నారో అనే భయంతో అందోళనచెందిన ఇన్నిరోజుల తర్వాత తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. తమ పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జనవరి 23న చైనాలోని వుహాన్‌ సిటీలో పీవో టీపీఎల్‌ ట్రైనింగ్‌కు తెలుగు విద్యార్థులు వెళ్లారు. అదే సమయంలో కరోనా వ్యాప్తితో విద్యార్థులంతా చిక్కుకున్నారు. వారిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్పందించిన కేంద్ర ప్రభుత్వం విదేశీ దౌత్యపరమైన చర్యలను చేపట్టడంతో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

విద్యార్థులను 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలించగా, వారిలో ఎవరికి ఎలాంటి కరోనా వైరస్‌ లక్షణాలు లేవని జిల్లా సర్వెలెన్స్‌ ఆఫీసర్‌ పార్థసారథి తెలిపారు. మరో 14 రోజుల పాటు విద్యార్థులను ఇంటి నుంచే పర్యవేక్షించనున్నట్టు తెలిపారు.

వైజాగ్ కు చెందిన 23ఏళ్ల యువతి వుహాన్ సిటీ నుంచి వైజాగ్ చేరుకుంది. ఆమెకు జ్వరం రావడంతో పెదవాల్తేరు ప్రభుత్వ ఛాతి ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానంతో యువతి శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు.

Covid-19
telugu students
reach vizag
China
wuhan city
coronavirus outbreak   

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు