సల్మాన్‌ను కలవాలని 600కిలోమీటర్లు సైకిల్ తొక్కి..

Submitted on 15 February 2020
Filmfare Awards 2020: Salman Khan Fan, 52, Cycles 600 Km To Meet The Star In Guwahati

బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్ ను కలవాలని అస్సాంకు చెందిన 52ఏళ్ల వ్యక్తి టిన్‌సూకియా 600కిలోమీటర్లు దూరం సైకిల్ తొక్కి ఎట్టకేలకు గమ్యం చేరుకున్నాడు. ఫిబ్రవరి 13న గుజరాత్‌లోని గువాహటిలో జరగనున్న జరిగే ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సల్మాన్ వస్తున్నాడనే సంగతి తెలియగానే వచ్చేశాడట.  

టిన్‌సూకియాకు ప్రాంతం నుంచి భూపాన్ లిక్సెన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 8న బయల్దేరి ఫిబ్రవరి 13నాటికి నగరంలోని ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం జరిగే చోటుకు చేరుకున్నాడు. 

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అతని పేరిట ప్రత్యేకమైన ఘనత ఉంది. 60నిమిషాల్లో 48కిలోమీటర్లు హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్2పై ప్రయాణించిన రికార్డు ఉంది. గువాహటిలో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 15న జరగనుంది. 

'గువాహటిలో జరిగి ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి సల్మాన్ ఖాన్ వస్తున్నాడని తెలిసింది. ఫిబ్రవరి 8న జాగున్ ప్రాంతం(టిన్‌సూకియా) నుంచి బయల్దేరాను' అని భూపెన్ చెప్పుకొచ్చాడు.

Filmfare Awards 2020
Salman Khan Fan
600 Km
Guwahati
cycle ride

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు