Cinema

Tuesday, July 14, 2015 - 07:42

చెన్నె : ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. చెన్నెలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1928 జూన్ 24న విశ్వనాథన్ జన్మించారు. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలకు స్వరాలందించారు. మూడు భాషల్లో 1200 సినిమాలకు సంగీతం అందించారు. సోలోగా 700 సినిమాలకు...

Monday, July 13, 2015 - 12:47

స్నేహితుడు శింబుకి 'వాలు' చిత్రంతో ఓ మంచి హిట్‌ రావాలనే ఉద్దేశ్యంతో ధనుష్‌ తన 'మారి'చిత్రం విడుదల తేదీని మార్చుకున్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడం కోసం ముందుకొచ్చిన ధనుష్‌ని కోలీవుడ్‌ సినిమా వర్గాలు ప్రశంసలతో ముంచెత్తాయి. స్నేహితుడి కోసం ధనుష్‌ ఎలాంటి సపోర్ట్‌ ఇచ్చాడో, అలాగే మాజీ ప్రియుడు శింబు కోసం హన్సిక కూడా అటువంటి సపోర్టే ఇస్తోంది. 'వాలు'చిత్ర...

Monday, July 13, 2015 - 12:39

2011లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'ఫోర్స్‌' చిత్రానికి సీక్వెల్‌గా అభినరు డియోల్‌ దర్శకత్వంలో 'ఫోర్స్‌2' చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత విపుల్‌షా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాయకానాయికలుగా జాన్‌ అబ్రహం, సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారు. సెప్టెంబర్‌ నుంచి షూటింగ్‌ జరుపుకునే ఈచిత్రం 2016లో విడుదల కానుంది. 'తొలిసారి జాన్‌అబ్రహంతో నటిస్తున్నా. 'ఫోర్స్‌2' కథెంతో బాగుంది....

Sunday, July 12, 2015 - 22:09

"బాహుబలి". గడిచిన వారం రోజులుగా తెలుగునాట చర్చంతా ఈ సినిమా గురించే. సినీ ప్రియుల నుంచి సినిమాలంటే పెద్దగా ఆసక్తి చూపనివారి దాకా అందరూ ఈ బాహుబలి సినిమా గురించే మాట్లాడేలా చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్‌ అయింది. ఫస్ట్‌డే కలెక్షన్‌లలోనూ ఇంతకు ముందు రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు సినిమా అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక అందరి దృష్టి అంతా..కలెక్షన్‌లపైనే ఉంది. చిత్ర బడ్జెట్...

Sunday, July 12, 2015 - 13:27

ఆయన సినిమాల్లో అంటరానితనంపై రగులుతున్న వ్యతిరేకత ఎగసిపడుతుంది. శ్రమదోపిడిపై ఉక్కుపిడికిలి బిగిస్తుంది. పేద ప్రజల ఆకలి బాధ ప్రతిధ్వనిస్తుంది. సగటు మహిళ హృదయాన్ని హృద్యంగా ఆవిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. భారతీయ సినిమాకు సామాజిక నడక నేర్పి, సంగీత సౌరభాలు నింపి, సృజనాత్మకత అద్దిన చిత్రశిల్పి..బిమల్ రాయ్. ఆయన జయంతి సందర్భంగా టెన్‌ టీవీ స్పెషల్‌ ఫోకస్..
బిమల్ రాయ్‌. భారతీయ...

Saturday, July 11, 2015 - 21:24

కైరో: హాలీవుడ్‌లో తొలితరం మేటి నటుడు ఒమర్ షరీఫ్‌ ఇకలేరు. చివరి రోజుల్లో గత కొంతకాలంగా అల్జీమర్స్ తో బాధపడ్డ ఆయన.. మంగళవారం ఈజిప్టు రాజధాని కైరోలోని ఆస్పత్రిలో తీవ్రమైన గుండెపోటుతో మరణించారు.
1932లో ఒమర్ షరీఫ్‌ జననం..
ఈజిప్టులో తుక్కు వ్యాపారం చేసే వారి ఇంట 1932లో ఒమర్ షరీఫ్‌ జన్మించారు. కళల పట్ల కుమారుడి ఆసక్తిని గమనించిన...

Friday, July 10, 2015 - 19:17

బాహుబలి.. బాహుబలి.. బాహుబలి...వారం నుంచి ఎక్కడ చూసినా ఎవరి నోట విన్న ఇదే మాట ఇదే చర్చ...తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు ఈ సినిమాకు వచ్చినంత హైప్ ఏ సినిమాకి రాలేదు అలాంటి భాహుభలి చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా...ఇప్పుడు చూద్దాం.
కథ:
ప్రమాదకర పరిస్థితులలో ఒక చంటి పిల్లాడిని కాపాడి జలపాతానికి దిగువున నివసిస్తున్న కొండజాతి దగ్గరకు చేర్చి...

Friday, July 10, 2015 - 13:32

హైదరాబాద్ : అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన తెలుగు సినిమా బాహుబలి నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా, నాజర్ లాంటి స్టార్ కాస్ట్ తో నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాళ, హిందీ బాషల్లో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు మూడుసంవత్సరాల పాటు తీసిన బాహుబలి సినిమా పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. మరి ఆ...

Friday, July 10, 2015 - 10:02

హైదరాబాద్: మూడేళ్ల నిరీక్షణకు తెర పడింది. వెండితెర చరిత్రను తిరగరాయడానికి బాహుబలి వచ్చేశాడు. మైమరిపించే అవంతిక అందాలు.. ఆ అందాల కోసం యుద్ధానికి దిగే బాహుబలి వీరత్వం.. ఆ బాహుబలిని బలి తీసుకోవాలని చూసే రుద్రావతారుడు భళ్లాలదేవ.. కాపాడాలని చూసే రాజమాత మాహిష్మతి... అదే బాహుబలి కోసం దీనంగా ఎదురుచూసే దేవసేన... ఒకటా రెండా ఎన్నో అద్భుతాలు.. మరెన్నో...

Thursday, July 9, 2015 - 21:30

హైదరాబాద్ : బాహుబలి..బాహుబలి..బాహుబలి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా వినిపిస్తున్న జక్కన్న జపం ఇది. సినీ ప్రేక్షకులు కళ్లలో లక్షల ఒత్తులేసుకుని మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వేల కోట్ల టర్నోవర్‌ నడిపిస్తున్న సినీ పరిశ్రమ జరగబోయే అద్భుతాన్ని చూడటానికి ఉత్కంఠతో చూస్తున్నారు. వెండితెరే ఆశ్చర్యపోయేలా బాహుబలి చిత్రం సెల్యూలాయిడ్‌ పైకి...

Thursday, July 9, 2015 - 19:02

ముంబై : బాలీవుడ్ బాద్ షా నటించిన తాజా చిత్రం 'ఫ్యాన్' టీజర్ గురువారం రిలీజైంది. మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేస్తున్నారు. షారుఖ్ కు జంటగా ఇలియానా, వాణికపూర్ లు నటిస్తున్నారు. ఇక ఈ వీడియోలో గత ఏడాది షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసం ఎదుట అభిమానులు చేసిన హడావుడిని చేర్చారు. టీజర్ ఆఖరులో 'మై ఆగయా..గౌరవ్' అంటూ క్యాప్షన్ ను...

Thursday, July 9, 2015 - 15:33

హైదరాబాద్: బుల్లి తెరపై లంగా వోణి వేసుకొని యాంకరింగ్ చేసే ఈ అమ్మాయిని చూస్తే అచ్చు పదహారణాల తెలుగు అమ్మాయిని చూసినట్లు అనిపిస్తుంది. ఆ ముద్దుగుమ్మే యాంకర్ ప్రశాంతి. యాంకర్ ప్రశాంతి ఇప్పుడు 'ఎఫైర్ ' చిత్రంలో నటిస్తోంది. ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే 'ఇల్లీగల్ ఎఫైర్' కథతో ఈ సినిమా రూపొందుతోంది. సస్పెన్స్, థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రశాంతి...

Thursday, July 9, 2015 - 13:40

హైదరాబాద్: బాహుబలి సినిమా టిక్కెట్లు.. ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తున్నాయి. టిక్కెట్ల అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోంది. ఒక్కో టిక్కెట్ ను రూ. 7వేలకు కొనుగోలు చేస్తున్నారు. బాహుబలి సినిమా టికెట్ల రేట్లను తగ్గించాలని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ సంధ్య, సుదర్శన్‌ థియేటర్ల దగ్గర ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సంరద్భంగా నేతలు మాట్లాడుతూ...

Wednesday, July 8, 2015 - 15:45

ఢిల్లీ : జైపూర్‌ - ఆగ్రా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంపై బిజెపి ఎంపి హేమామాలిని తొలిసారిగా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈ ఘటనపై మృతి చెందిన చిన్నారి తండ్రినే దోషిగా నిలిపారు. మృతి చెందిన చిన్నారి తండ్రి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఉంటే ప్రమాదం జరిగేది కాదని, పాప బతికేదని అన్నారు. పాప చనిపోవడం తనను కలచివేసిందని హేమమాలిని పేర్కొన్నారు. హేమమాలిని ట్విట్టర్‌పై...

Wednesday, July 8, 2015 - 09:57

హైదరాబాద్: జక్కన్న చెక్కిన శిల్పం 'బాహుబలి'పై ఓ వివాదం చెలరేగుతోంది. ఈ సినిమాలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలు, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ డిమాండ్ చేసింది. యూట్యూబ్ లో మాలలను కించపరుస్తూ ఉన్న ఈ క్లిప్పింగ్స్ సేకరించి పోలీసులకు అందిస్తూ, ఇప్పటికే ఫిర్యాదు చేశామని జేఏసీ చైర్మన్ బి. దీపక్ కుమార్ వివరించారు. ఈ దృశ్యాలను...

Wednesday, July 8, 2015 - 07:57

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ స్పీచ్ పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ గర్జించే సింహం అని..సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకి ఆర్థం లేదన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే గర్జించే సింహం మేకలా మాట్లాడుతోంది..సారీ పిల్లిలా మాట్లాడుతోంది అని పవన్ ప్రసంగాన్ని ఉద్దేశించి అన్నారు. సింహంలాంటి పవన్ కి నా విన్నపం ఒకటే పిల్లిలా...

Tuesday, July 7, 2015 - 15:09

హైదరాబాద్: 'హౌస్ వుయ్ ఆర్ కాస్టింగ్' అంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు చెందిన ప్రొడక్షన్ చక్కగా పాడగల టీనేజీ అమ్మాయి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఇందుకోసం రూపొందించిన ఓ ప్రకటనను అమిర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 12 నుంచి 17 మధ్య వయసు ఉన్న బాగా పాడగల అమ్మాయి కావాలనుకుంటున్నట్టు ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు తమకు నచ్చిన హిందీ పాట పాడిన వీడియోను...

Tuesday, July 7, 2015 - 12:51

హైదరాబాద్: 'బాహుబలి' సినిమాను పెద్ద తెరపైనే చూడాలని చిత్ర దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈమేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రతి డిజిటల్ ప్రింట్ మీద వాటర్ మార్కింగ్ ఉంటుందని.. ఏ.. థియేటర్ లో పైరసీ చేసిన డేట్, టైమ్ తో సహా తెలుస్తుందన్నారు. థియేటర్ల యజమానులు ఆపరేటర్లకు హెచ్చరికలు జారీ చేయాలని చెప్పారు. నైట్ షో తర్వాత స్పెషల్ షో వేసుకుని పైరసీకి పాల్పడుతున్నారని...

Monday, July 6, 2015 - 20:12

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసుతో పాటు చాలా అంశాలపై పవన్‌ స్పందించడం లేదన్న నేతల కామెంట్లకు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో రియాక్ట్‌ అయ్యారు పవర్‌స్టార్‌. తెలంగాణ సాధించినందుకు ఆ ప్రాంత నేతలను అభినందించారు పవన్‌. అదే సమయంలో ఏపీకి ఏమీ సాధించలేకపోతున్నారంటూ ఎంపీలపై విరుకుచుపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పోరాట స్ఫూర్తిని ఏపీ ఎంపీలు కనబరచడం లేదన్నారు....

Monday, July 6, 2015 - 20:11

హైదరాబాద్ : పవన్‌ కళ్యాణ్‌ వేషధారణ మారింది.. అలాగే డైలాగ్‌ డెలవరీ చేంజ్‌ అయింది.. మహాభారతంలో కృష్ణుడిలా.. కర్తవ్యాన్ని గుర్తుచేసే సైనికుడిలా.. రెండు రాష్ట్రాల ప్రజలకు శ్రేయోభిలాషిలా.. అందిరి మంచి కోరే వాడిలా.. ఒక్కసారిగా ఎవరూ ఊహించనంతగా మార్పువచ్చింది.. ప్రశ్నిస్తానని చెప్పిన నేత ఉన్నట్టుండి తెల్లజెండా ఊపారు.. గొడవలు మాని కలిసిమెలసి ఉండంటూ శాంతి సందేశం...

Monday, July 6, 2015 - 18:45

మళయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రాన్ని రామ్‌ హీరోగా తెలుగులో రీమేక్‌ చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే 'ప్రేమమ్‌' చిత్రానికి సంబంధించి రీమేక్‌ రైట్స్ ను నిర్మాత స్రవంతి రవికిషోర్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు సమాచారం. 'పండగ చేస్కో' చిత్రం తర్వాత రామ్‌ 'శివమ్‌', 'హరికథ' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా సరైన విజయాలు లేని రామ్‌కి ఈ సరికొత్త...

Monday, July 6, 2015 - 18:40

అక్షరుకుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా అన్నదమ్ములుగా కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్న 'బ్రదర్స్' చిత్రంలోని ఓ స్పెషల్‌ మాస్‌ మసాలా సాంగ్‌లో కరీనా కపూర్‌ మెరవనుంది. 'మేరా నామ్‌ మేరీ' అంటూ సాగే ఐటమ్‌ సాంగ్‌లో అందాల్ని ఆరబోస్తూ స్పైసీగా ఉన్న కరీనాకపూర్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను నిర్మాత కరణ్‌ జోహార్‌ విడుదల చేశారు. 'ఫెవికాల్‌ సే...' ఐటమ్‌ సాంగ్‌తో ఓ ఊపుఊపేసిన కరీనా, ఈ చిత్రంలో సైతం హాట్...

Monday, July 6, 2015 - 18:33

భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ జీవిత చరిత్ర ఆధారంగా 'అజహర్‌' పేరుతో బాలీవుడ్‌లో సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో అజహర్‌ పాత్రలో ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్నారు. అజారుద్దీన్‌ భార్య సంగీత బిజ్లానీ పాత్ర కోసం నర్గీస్‌ ఫక్రీని సంప్రదించారట. కథ నచ్చి నర్గీస్‌ కూడా అంగీకారం తెలపడంతో సినిమాపై మరికొంత ఆసక్తి నెలకొంది. తొలుత ఈ పాత్ర కోసం కరీనాకపూర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్...

Monday, July 6, 2015 - 17:33

హైదరాబాద్ : నేను ఏది పడితే అది మాట్లాడనని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు రాజకీయాలు కొత్త అని, దేశం పట్ల నాకు అవగాహన ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారంపై కూడా ఆయన అభిప్రాయాలు తెలిపారు...

Sunday, July 5, 2015 - 21:09

సినీనటి, బాహుబలి హీరోయిన్ తమన్నాతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తమన్నా బాహుబలి సినిమా షూటింగ్ అనుభవాలను వివరించారు. సినిమా అద్భుతంగా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Friday, July 3, 2015 - 06:42

జైపూర్ : సినీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, హేమమాలిని గాయపడ్డారు. మధుర నుంచి జైపూర్ వైపు వెళ్తున్న ఆమె ప్రయాణిస్తున్న బెంజ్ కారు దౌసా వద్ద ఎదురుగా వస్తున్న ఆల్టో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆల్టోలో ప్రయాణిస్తన్న నాలుగేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కాగా హేమమాలిని...

Thursday, July 2, 2015 - 19:06

పి.వి.పి. పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పొట్లూరి. వి.ప్రసాద్‌ దర్శకత్వంలో నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం తాజా షెడ్యూల్‌ యూరప్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..'నా కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ కమర్షియల్‌ చిత్రమవుతుంది' అని చెప్పారు. 'నాగార్జునలాంటి స్టార్‌తో తొలిసారిగా తెలుగు స్ట్రయిట్‌...

Pages

Don't Miss