Cinema

Thursday, November 8, 2018 - 15:42

మిల్కీబ్యూటీ తమన్నా, సందీప్ కిషన్ జంటగా, బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో, రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న చిత్రానికి నెక్స్ట్ ఏంటి అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నవదీప్, పూనమ్ కౌర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాటలే సినిమాకి టైటిల్స్‌గా పెట్టడం చూస్తున్నాం. నాని హీరోగా నటించిన నేను లోకల్ మూవీలో, నెక్స్ట్ ఏంటి అనే సాంగ్ పాపులర్ అయింది. ఇప్పుడు...

Thursday, November 8, 2018 - 14:11

తమిళ స్టార్ హీరో, తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో, వీరం, వేదాళం, వివేకం తర్వాత, విశ్వాసం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సెట్‌లో, ఒక డ్యాన్సర్ మరణించిన ఘటన గురించి తెలిసి కోలీవుడ్ ఉలిక్కి పడింది.
ప్రస్తుతం, విశ్వాసం సినిమాలోని ఒక పాట చిత్రీకరణ పూణెలో జరుగుతుంది. రిహార్సల్స్ చేస్తున్న టైమ్‌లో, శరవణన్ అనే డ్యాన్సర్, గుండెపోటు రావడంతో సెట్‌...

Thursday, November 8, 2018 - 12:33

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్స్ తర్వాత తెరకెక్కిన సినిమా, సర్కార్.. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన సర్కార్, భారీ అంచనాల మధ్య, దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో మొన్న రిలీజ్ అయింది. తెలుగు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా, తమిళనాట మాత్రం, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. 
అంతేకాదు, కేవలం రెండే రెండు రోజల్లో...

Thursday, November 8, 2018 - 11:51

ఈ దీపావళికి దళపతి నటించిన సర్కార్ విజయంతో,  విజయ్ అభిమానులు, తమిళ ప్రేక్షకులకు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. దీపావళికి కోలీవుడ్ కొత్త సినిమా అప్ డేట్స్‌తో కళకళలాడింది. పండగ సందర్భంగా.. ముందురోజు, చియాన్ విక్రమ్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పండగ నాడు, తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఎన్‌జీకే మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేసారు. సూర్యకిది 36వ సినిమా. సెల్వరాఘవ...

Thursday, November 8, 2018 - 11:12

దీపావళికి ఓవైపు టపాసుల మోత మోగుతుంటే, సినిమా పరిశ్రమ కొత్త సినిమాల ఫస్ట్‌లుక్స్, అప్‌డేట్స్‌తో అదరగొట్టేసింది. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఏంటో చూద్దాం.. విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు జంటగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న మూవీ.. ఎఫ్2. వెంకీ, వరుణ్ తోడల్లుళ్ళుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఎర్ర...

Tuesday, November 6, 2018 - 19:12

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో, రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ, 2.ఓ.. అక్షయ్ కుమార్ విలన్‌గా, అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించారు. లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్, రూ. 550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ‌సినిమా ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. కేవలం, 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు 2.ఓ...

Tuesday, November 6, 2018 - 18:02

చియాన్ విక్రమ్.. వయసుతో సంబంధం లేకుండా, క్యారెక్టర్ కోసం ఒళ్ళు హూనం చేసుకుంటాడు. ప్రతీ సినిమాలోనూ తన పాత్ర  వైవిధ్య భరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ట్రైచేసే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందితే ఎలా ఉంటుంది. బొమ్మ అదుర్స్ కదూ.. ఇంతకీ కమల్, విక్రమ్ కలిసి చేస్తున్న సినిమా సంగతులేంటంటే, రాజేష్...

Tuesday, November 6, 2018 - 17:17

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, సంతోషంలో మునిగి తేలుతుంది. చిరు నటిస్తున్న సైరా సమ్మర్‌లో రిలీజవుతుంది. రామ్ చరణ్, వినయ విధేయ రామ.. ఏమో సంక్రాంతికొస్తుంది. మరి చిరు ఫ్యామిలీ సంతోషానికి కారణం ఏంటబ్బా అనుకుంటున్నారా?
చిరు రెండవ కూతురు శ్రీజ, త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని చిరు చిన్నల్లుడు, విజేత సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన కళ్యాణ్ దేవ్...

Tuesday, November 6, 2018 - 16:23

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్స్ తర్వాత తెరకెక్కిన సినిమా, సర్కార్.. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన సర్కార్, భారీ అంచనాల మధ్య, దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో ప్రపంచవ్యాప్తంగా  ఈరోజు రిలీజ్ అయిన సర్కార్ ఎలా ఉందో చూద్దాం.
...

Tuesday, November 6, 2018 - 14:50

హైదరాబాద్: ఆమె ఎక్కడా.. ఎప్పుడూ ‘‘పాడుతా తీయగా’’ లాంటి టీవీ ప్రోగ్రామ్‌లలో పాడలేదు. పనీపాట చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్న పసల బేబీ అనే మహిళ పాడిన పాటకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఎంతో శ్రావ్యంగా.. ఎక్కడా తొణికసలాట లేకుండా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘ప్రేమికుడు’ సినిమా కోసం అందించిన సంగీతఝరికి పదాలు...

Tuesday, November 6, 2018 - 13:46

మెగా ఫ్యాన్స్‌ఎంతగానో ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, డివివి దానయ్య నిర్మిస్తున్న కొత్త సినిమాకి, వినయ విధేయ రామ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, దీపావళి సందర్భంగా, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసారు. పోస్టర్‌లో ఎప్పటిలానే బోయపాటి తన మాస్ మార్క్ చూపించగా, చెర్రీ ఎమోషనల్‌గా పరిగెడుతూ, ఒక చేత్తో కత్తి పట్టుకుని,...

Tuesday, November 6, 2018 - 12:54

గతకొద్ది రోజులుగా సినీ రంగలో సంచలనం రేపుతోంది, మీటూ ఉద్యమం. ఈ వివాదంలో ప్రముఖనటుడు అర్జున్ కూడా చిక్కుకున్నాడు. విస్మయ అనే కన్నడ చిత్రం షూటింగ్ సమయంలో అర్జున్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, నటి శృతి హరిహరన్ ఆరోపించడం, అర్జున్ ఖండిచండం, వారిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి సీనియర్ నటుడు అంబరీష్ ప్రయత్రించినా ఫలితం లేకపోవడంతో, ఎట్టకేలకు అర్జున్ పోలీస్ స్టేషన్ గడప తొక్కక తప్పలేదు...

Tuesday, November 6, 2018 - 11:13

నందమూరి బాలకృష్ణ,దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో, ఎన్టీఆర్ బయోపిక్‌ని, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్  శరవేగంగా జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్‌లోనూ మూవీ యూనిట్ చాలా యాక్టివ్‌గా ఉంది.. ఇప్పటి వరకు విడుదల చేసిన బాలయ్య వివిధ లుక్స్‌కి, సుమంత్, రానా, కళ్యాణ్ రామ్,  రకుల్...

Tuesday, November 6, 2018 - 10:31

కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, లైట్ హౌస్ మూవీ మేకర్స్ సమర్పణలో, రజత్ రవిశంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా, దేవ్.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన దేవ్ ఫస్ట్‌లుక్‌కి ఆడియన్స్‌ నుండి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో దేవ్ టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఒక నిమిషం నిడివిగల టీజర్‌లో, సినిమా కాన్సెప్ట్ ఏంటో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసారు. అందరిలా మెషీన్‌లా పని చెయ్యడం...

Monday, November 5, 2018 - 16:40

హైదరాబాద్ : టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతున్నాయి. వీటికి సీనియర్ హీరోలు..యంగ్ హీరోలు మొగ్గు చూపుతున్నారు. యంగ్ హీరోలతో నటించడానికి సీనియర్ హీరోలు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. వెంకటేష్..నాగార్జునలు ఇప్పటికే యంగ్ హీరోల సరసన నటించి మెప్పించారు. తాజాగా వెంకటేష్ మరో మల్టీస్టారర్ చిత్రంలో...

Monday, November 5, 2018 - 16:06

హైదరాబాద్ : టాలీవుడ్..బాలీవుడ్..హాలీవుడ్..ఇలా ఏ వుడ్ అయినా యూ ట్యూబ్‌ని చక్కగా ఉపయోగించుకొంటోంది. సినిమాలకు సంబంధించిన టీజర్..ట్రైలర్..ఇతర వీడియోలను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్ని వీడియోస్‌కి నెటిజన్ల నుండి తెగ రెస్పాన్స్ వస్తోంది. మిలియన్..వ్యూస్ వచ్చాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా...

Monday, November 5, 2018 - 15:23

హైదరాబాద్ : సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్‌లు ఆస్తకి రేపుతుంటాయి. అంతేకుండా ఉత్కంఠను రేకేత్తిస్తుంటాయి. సినిమా ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు దీనిపై సామాజిక మాధ్యమాల్లో తెగ వార్తలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొంది. ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్‌లు నిర్మిస్తున్న సంగతి...

Monday, November 5, 2018 - 14:57

హైదరాబాద్ : టాలీవుడ్‌లో ‘విజయ్ దేవరకొండ’ ఇమేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అర్జున్ రెడ్డి చిత్రం అనంతరం ఇతని ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తనదైన స్టైల్..నటనతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతమున్న యూత్‌లో విజయ్ దేవరకొండ అంటే ఒక క్రేజ్. ప్రస్తుతం ఇతను టాప్ హీరోల స్థానానికి ఎగబాకేందుకు ప్లాన్స్...

Monday, November 5, 2018 - 13:57

ముంబై: భారత దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, కెరీర్‌లో ఎదురైన అనుభవాలను, పాత జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. తన 25వ ఏట వరకు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచలు వచ్చేవని రెహమాన్ వెల్లడించారు. 9 ఏళ్ల వయసులోనే...

Monday, November 5, 2018 - 09:07

ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ జీవితచరిత్ర ఆధారంగా కృష్ణ త్రిలోక్ రాసిన బయోగ్రఫీ ‘నోట్స్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌: ది ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహ్మాన్‌’ని శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న పలు ఆసక్తికర విషయాలను, అనుభవాలను...

Sunday, November 4, 2018 - 17:34

ట్విట్టర్‌లో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులను ఫాలో అవుతుంటారు. దానివల్ల తమ ఫేవరెట్ నటుల లేదా, పొలిటిషియన్ల లేటెస్ట్‌అప్‌డేట్స్‌ అన్నీతెలుస్తుంటాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ, ఈ ట్విట్టర్ అనేది ఒక వేదికగా మారింది. ట్వట్టర్ గురించి ఇంతగా చెప్తున్నానేంటనుకుంటున్నారా? మరేం లేదు. ఈరోజు ట్వట్టర్‌లో, తెలంగాణా ఐ.టి. మంత్రి కేటీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనలకి...

Sunday, November 4, 2018 - 16:41

రాయ్ లక్ష్మి, గతేడాది మెగాస్టార్ పక్కన రత్తాలు పాటలో రచ్చ రచ్చ చేసింది. తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా, తమిళ్‌లో మాత్రం బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్న రెండు సినిమాల లుక్స్‌ ఈరోజు రిలీజ్ అయ్యాయి. తెలుగు, తమిళ్‌లో రూపొందుతున్న వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి, లుక్‌ని, యంగ్ హీరో నితిన్ లాంచ్ చెయ్యగా, సిండ్రెల్లా అనే హారర్ మూవీ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేసారు...

Sunday, November 4, 2018 - 15:23

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి కంటెంట్‌తో రూపొందే సినిమాలకు ఆదరణ లభిస్తుంది. ఇప్పుడదే కోవలో,అంతా కొత్త వాళ్ళతో, హవా అనే చిత్రం రాబోతుంది. చైతన్య మదాడి, దివి ప్రసన్న జంటగా, మహేష్ రెడ్డి డైరక్షన్‌‌లో, ఫిల్మ్‌అండ్ రీల్ సమర్పణలో తెరకెక్కుతున్న హవా మూవీ ట్రైలర్, రీసెంట్‌గా రిలీజ్ అయింది. నైన్ బ్రెయిన్స్, నైన్ క్రైమ్స్, నైన్ హవర్స్ అంటూ, డిఫరెంట్‌గా ప్రమోట్...

Sunday, November 4, 2018 - 13:32

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో జోష్ మీదున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవలే విదేశాల్లో షూటింగ్ కంప్లీట్...

Sunday, November 4, 2018 - 12:12

రామ్ గోపాల్ వర్మ సమర్పణలో, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై, అభిషేక్ నామా, భాస్కర్ రషి నిర్మాతలుగా, ధనుంజయ, ఇర్రా మోర్ జంటగా, వర్మ శిష్యుడు సిద్దార్థ డైరెక్షన్‌లో, రాయల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో, తెరకెక్కిన ఫ్యాక్షన్ అండ్ లవ్ సినిమా.. భైరవ గీత.
రెండునెలల క్రితం భైరవ గీత టీజర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్, ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసింది. రెండు నిమిషాల  ఈ ట్రైలర్ ఆద్యంతం రక్తపాతం,...

Saturday, November 3, 2018 - 17:46

2.ఓ అఫీషియల్ ట్రైలర్‌ని, చెన్నైలో నేషనల్, రీజనల్ మీడియా మరియు, మూవీ యూనిట్ సమక్షంలో, అంగరంగ వైభవంగా రిలీజ్ చేసారు.  తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల అయిన ట్రైలర్స్‌కి హ్యూజ్ రెస్పాన్స్‌వస్తోంది. ఒక్క చెన్నైలోనే కాక, సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, న్యూజిలాండ్, యూఎస్ఏ, యూకే, యూఏఈ, సౌదీ అరేబియా, రష్యా వంటి పలు దేశాల్లో, వివిధ సమయాలలో రిలీజ్ చెయ్యడం...

Saturday, November 3, 2018 - 16:16

 2.ఓ ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురు చూసిన సినీ అభిమానుల  కోరిక ఈరోజు తీరిపోయింది. 2.ఓ ట్రైలర్‌ని, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో, మూవీ యూనిట్  రిలీజ్ చేసింది.  ట్రైలర్‌ లాంచ్ కోసం పెద్ద ఎత్తున లైవ్ ప్రోగ్రాం నిర్వహించారు. పలువురు సెలబ్రెటీల స్పందన తెలుసుకోవడానికి, స్క్రీన్‌పై, ఆన్‌లైన్ ప్రొజెక్ట్‌చేసిన వీడియోలు ప్లే చేసారు. ఒక వీడియోలో దర్శక ధీరుడు రాజమౌళి,...

Pages

Don't Miss