పల్నాడులో ఉద్రిక్తత : కొట్టుకున్న టీడీపీ - వైసీపీ కార్యకర్తలు

Submitted on 25 May 2019
fight Between YCP And TDP Activists at Dachepalle

గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ - వైసీపీ కార్యకర్తలు నడి రోడ్డుపై కొట్లాడుకున్నారు. కర్రలు, గొడ్డళ్లతో దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మ్రోగించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ - వైసీపీ శ్రేణుల మధ్య గొడవలు చెలరేగుతున్నాయి.

మే 25వ తేదీ శనివారం ఉదయం దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. వివాదం కాస్త పెద్దదైంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇంట్లో నుండి కర్రలు, గొడ్డళ్లు తెచ్చి దాడికి పాల్పడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

fight
between
YCP And TDP
Activists
Dachepalle
guntur district

మరిన్ని వార్తలు