రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం : సెల్ టవర్ ఎక్కిన రైతన్న  

Submitted on 20 November 2019
Farmer Protests By Climbing Cell Tower at Mothku

సాగు చేసే రైతులు నిరసన వ్యక్తంచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు.కష్ట నష్టాలకు వెరువకుండా పాడి పంటలు పండించే రైతులు తమ భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితికి వచ్చారు. పాసు పుస్తకాల కోసం సంవత్సరల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న క్రమంలో సహనం కోల్పోయిన రైతులు పెట్రోల్ బాటిళ్లతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు.

ఈ క్రమంలో ఓ రైతు తన భూమి కోసం సెల్ టవర్ఎక్కి నిరసన వ్యక్తంచేశారు.  తన భూమిలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని సత్యనారాయణ అనే రైతు సెల్ టవర్ ఎక్కాడు. తన భూమిలో మైనింగ్ మానివేయాలని డిమాండ్ చేశాడు. తనకు న్యాయంచేయాలని కోరుకుంటున్నాడు. 

యాదాద్రి జిల్లా మోత్కూర్ లో సత్యనారాయణకు కొంత భూమి ఉంది. ఆ భూమి నుంచి కొంతమంది మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ ప్రభుత్వ అధికారులకు..పోలీసులకు గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్నాడు. కానీ రెవెన్యూ అధికారులు గానీ, పోలీసులు గానీ సత్యనారాయణ గోడును పట్టించుకోలేదు.

దీంతో తన భూమిలో మట్టిని అక్రమంగా తరలిస్తుండగా  సాగు చేసుకోవటానికి కష్టాసాధ్యంగా మారిందనీ..తనకు న్యాయంచేయమని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన సత్యనారాయణ మోత్కూర్ లో ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కాడు. దీంతో సెల్ టవర్ దగ్గరకు చేరుకున్న పోలీసులు సత్యనారాయణకు సర్థి చెప్పేందుకు యత్నిస్తున్నారు. కానీ..సంబంధిత అధికారులు గానీ, స్థానిక ఎమ్మెల్యే వచ్చిన తనకు హామీ ఇస్తేనే  తనకు  దిగి వస్తాననీ..లేకుండా అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని డిమాండ్ చేసాడు. 

Yadadri
Mothkuru
Farmer
Satyanarayana
cell tower
Protests By Climbing

మరిన్ని వార్తలు