ప్రముఖ కవి వేదవ్యాస్ రంగభట్టార్ కన్నుమూత

Submitted on 21 February 2019
Famous Lyricist Vedavyas Rangabhattar Passes Away-10TV

ప్రముఖ కవి, తన పాటలతో ప్రేక్షకులను పరవశింప చేసిన రచయిత, వేదవ్యాస్ రంగభట్టార్ కన్నుమూసారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో స్విమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న రంగభట్టార్.. ఈ రోజు ఉదయం (ఫిబ్రవరి 21) తుదిశ్వాస విడిచారు. ఆయన ఇక లేరు అనే వార్తను ఆయన కుటుంబీకులు మీడియాకు చెప్పారు. రంగభట్టార్ తన కలంతో ఎన్నో అరుదైన, అద్భుతమైన, మరుపురాని, మధురమైన పాటలు రాసారు. శ్రీ మంజునాథ లోని ఓం, మహాప్రాణ దీపం.. పాట రంగభట్టార్ రాసినదే.. కె.రాఘవేంద్ర రావుతో కలిసి, శ్రీరామదాసు, పాండురంగడు, జగద్గురు ఆదిశంకర, నమో వేంకటేశాయ వంటి పలు సినిమాలకు ఆయన పాటలు రాసారు. వేదవ్యాస్ రంగభట్టార్ మృతికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం తెలిపారు.

వాచ్ ఓం, మహాప్రాణ దీపం సాంగ్...    

Lyricist Vedavyas Rangabhattar
Famous Lyricist Vedavyas Rangabhattar Passes Away

మరిన్ని వార్తలు