ఫలక్‌నామా దాస్-ఫస్ట్ సాంగ్ విన్నారా?

Submitted on 18 February 2019
Falaknuma Das - Paye Paye Lyrical song (Telugu)-10TV

వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న ఫిలిమ్.. ఫలక్‌నామా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పక్కా హైదరాబాదీ స్టైల్‌లో రూపొందిన ఫలక్‌నామా దాస్ మూవీ టీజర్‌కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమాలో నుండి, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. రాజు అటు రాణి ఇటు ఆడిందే ఆటరా.. అనే పాటకి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, శివ నాగులు పాడారు. వివేక్ సాగర్ ట్యూన్ కంపోజ్ చేసాడు. సాంగ్ అంతా హైదరాబాదీ స్టైల్‌లో, ఫుల్ జోష్‌‌గా ఉంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పోలీస్ క్యారెక్టర్‌లో నటించగా, ఉత్తేజ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం : వివేక్ సాగర్, కెమెరా : విద్యా సాగర్, ఎడిటింగ్ : రవితేజ, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కిట్టు విస్సాప్రగడ.

వాచ్ లిరికల్ సాంగ్...

Suddala Ashok Teja
Rahul Siplijung and Shiva Nagulu
Vivek Sagar
Vishwak Sen

మరిన్ని వార్తలు