జయసూర్య చచ్చిపోయింది నిజమేనా: రవిచంద్రన్ అశ్విన్

Submitted on 27 May 2019
Fake rumours of Sanath Jayasuriya's death leaves Ravichandran Ashwin

ఇటీవల వివాదాల్లో కనిపించిన శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యా చనిపోయాడంటూ ఫేస్ బుక్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. అతని ఫొటో ఉంచి దానికి నివాళులు అర్పించేస్తున్నారు. దీనిపై టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించాడు. కెనడాలోని కార్ యాక్సిడెంట్‌లో సనత్ మరణించినిట్లు వార్తలు వినిపించడంపై సందేహం వ్యక్తం చేస్తూ ట్వీట్ ద్వారా ప్రశ్నించాడు. 

'సనత్ జయసూర్యా గురించి వినిపిస్తున్న వార్తలు నిజమేనా. నాకు వాట్సప్‌లో ఓ వార్త తెలిసింది. కానీ, ట్విట్టర్‌లో అటువంటిదేమీ కనిపించడం లేదు' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అశ్విన్‌ ట్వీట్‌పై భారీ స్పందనే వచ్చిందని ఆ వార్త పూర్తిగా ఫేక్ అని జయసూర్య బతికే ఉన్నాడంటూ అభిమానులు సమాధానమిచ్చారు. 

పాపం ఈ ట్వీట్‌‍పై జయసూర్య స్వయంగా స్పందించి వివరణ ఇచ్చుకున్నాడు. 'కొన్ని వెబ్‌సైట్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఇటీవలే కెనడాకు వెళ్లి వచ్చాను. ఇప్పుడు శ్రీలంకలో క్షేమంగా ఉన్నాను. ఇటువంటి వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేశాడు. 

Sanath Jayasuriya
ravichandran ashwin
Sri Lanka

మరిన్ని వార్తలు