మీ గొంతు అరువు ఇస్తారా? ఫేస్‌బుక్ రూ.350 చెల్లిస్తుంది!

Submitted on 22 February 2020
Facebook, Pay You Rs 350, Your Voice, Device’s Speech, Recognition Better, Pronunciations, Hey Portal 

స్మార్ట్ స్పీకర్లు గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. స్పీచ్ రికగ్నైజేషన్ డివైజ్‌ల్లో మన గొంతును గుర్తించే స్మార్ట్ స్సీకర్ల అంటే అందరూ ఇష్టపడతారు. అవి ఏం చెబితే అదే మనం చేస్తుంటాం కూడా. ఏది ఏమైనా.. ప్రైవసీ కారణాల దృష్ట్యా అమెజాన్, గూగుల్ సహా ఆపిల్ కంపెనీలు మీ గొంతును మరింత గుర్తించేందుకు వీలుగా తమ AI ట్రైనింగ్ సర్వీసులను నిలిపివేశాయి. ఇప్పుడు ఆయా కంపెనీలన్నీ యూజర్లను సైనప్ కావాల్సిందిగా కోరుతున్నాయి.

దీనిద్వారా యూజర్ల స్పీచ్ స్పష్టతతో గుర్తించడానికి వీలుంటుంది. ఫేస్ బుక్ తమ యూజర్ల స్పీచ్ గుర్తించేందుకు వీలుగా వాయిస్ రికగ్నైజేషన్ డివైజ్‌ల్లో పోర్టల్ లైన్ కలిగి ఉంది. ఇందులో భాగంగా ఫేస్ బుక్ యూజర్లను గొంతు అరువు అడుగుతోంది. వాస్తవానికి వాయిస్ స్నిప్పెట్లను రికార్డు చేయడానికి బదులుగా యూజర్లకు ఫేస్ బుక్ డబ్బును చెల్లిస్తోంది. అంటే.. ఒక్కో యూజర్ తన గొంతు అరువు ఇవ్వడం ద్వారా దాదాపు 5 డాలర్లు (రూ.350) వరకు సంపాదించుకోవచ్చు. 

ఇదొక ఫేస్ బుక్ ప్రొనౌన్సియేషన్ (Pronunciations) కొత్త ప్రొగ్రామ్‌లో భాగంగా పిలుస్తారు. మార్కెట్ రీసెర్చ్ యాప్ నుంచి సలహాలు సూచలను ద్వారా సాయం తీసుకుంటుంది. ఈ టెస్టులో అర్హత సాధించేందుకు యూజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి అర్హత సాధిస్తే.. ఆ యాప్.. యూజర్లను.. Hey Portal అని రికార్డు చేయమని అడుగుతుంది. యూజర్ ఫ్రెండ్ లిస్టులో నుంచి ఒకరి పేరుతో అడుగుతుంది. అప్పుడు ఆ యూజర్ ఈ ప్రకటనను రెండుసార్లు పలకాల్సి ఉంటుంది. 

ఇలా ఒకేమాదిరిగా 10 ప్రత్యేక పేర్లతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మొత్తంగా 200 వ్యూ పాయింట్లు వస్తాయి. తద్వారా యూజర్ కు కొంతమొత్తంలో డబ్బు పొందవచ్చు. ఒక్కో యూజర్ ఇలా 1000 పాయింట్లు సంపాదించవచ్చు. యూజర్లు తమ గొంతును ఐదు దశలుగా వేర్వేరు పేర్లతో రికార్డు చేయాల్సి ఉంటుంది. అప్పుడు వారికి ఫేస్ బుక్ 5 డాలర్లు చెల్లిస్తుంది. మీరు కూడా ఈ గొంతును అరువు ఇచ్చి డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫేస్ బుక్ స్మార్ట్ డివైజ్ లో సైనప్ అవ్వండి. 

Facebook
Pay You Rs 350
Your Voice
Device’s Speech
Recognition Better
Pronunciations
Hey Portal 

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు