షాకిచ్చిన  ఫేస్ బుక్: యూజర్ల పాస్ వర్డ్ మాకు తెలుసు  

Submitted on 22 March 2019
Facebook users passwords for users were exposed to Facebook employees

పాస్ వర్డ్ అంటే పర్సనల్. అది ఎవ్వరికి చెప్పేది కాదు..మరెవ్వరూ చూసేది కాదు.కానీ పర్సనల్ అనుకున్నది పబ్లిక్ అయిపోతే..ఆ పాస్ వర్డ్ అందరికీ తెలిసిపోతే..ఇలా జరిగితే..పర్సనల్ అనే మాట  (పాస్ వర్డ్)కు అర్థముంటుందా? లేదు కదూ. కొన్ని సందర్భాలలో అది నేరం క్రిందికి కూడా వస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజంలో డేటా విషయంలో వివాదం రేకుతున్న క్రమంలో తమ యూజర్లకు ఫేస్ బుక్ మరో షాక్ ఇచ్చింది. అదే తమ యూజర్ల ‘పాస్ వర్డ్’ తమకు తెలుసు అనీ..
Read Also : కొత్త ఆప్షన్ : రైలు టికెట్ బదిలీ చేసుకోవచ్చు
 
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిగా ఉన్న తమ ఖాతాదారుల పాస్ వర్డ్ లు తమ ఉద్యోగులకు తెలుసనీ...ఇంటర్నల్ సర్వర్లలో వాటిని సేవ్ చేసి ఉంచామని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజనం ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..ఈ పాస్ వర్డ్ లు ఫేస్ బుక్ బయటివారికి ఎప్రటికీ కనిపించ(తెలియవు)వనీ..కేవలం ఫేస్ బుక్ సంస్థలోని ఉద్యోగులకు మాత్రమే  కనిపిస్తుంటాయని తెలిపింది. వాటిని మా ఉద్యోగులు మిస్ యూజ్ (దుర్వినియోగం) చేశారనే ఆరోపణలు ఇంతవరకూ రాలేదని..సంస్థ ఇంజనీరింగ్, సెక్యూరిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ పెడ్రో కనాహువాటి తన బ్లాగ్ లో వెల్లడించారు. ఉద్యోగులకు పాస్ వర్డ్ లు కనిపిస్తాయన్న విషయాన్ని ఈ సంవత్సరం స్టాటింగ్ లోనే తాము తెలుసుకున్నామని ఆయన చెప్పడం గమనించాల్సిన విషయం. 
Read Also : ఇ-ఆటోలు ప్రవేశపెట్టనున్న హైదరాబాద్ మెట్రో

కాగా ఇప్పటికే ఫేస్ బుక్ డేటా సెక్యూరిటీపై అందోళన వెల్లువెత్తుతున్న సమయంలో ఈ  పాస్ వర్డ్ ఇష్యూ తెరపైకి రావటంతో యూజర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు ఆ యూజర్ల పాస్ వర్డ్ లను ప్లెయిన్ టెక్ట్స్ ఫార్మాట్ లో సర్వర్లలో దాచామని..అవి సంస్థ ఉద్యోగులకు తప్ప మరొకరికి కనిపించవని చెప్పడం భద్రతా నిబంధనలకు విరుద్ధమేనని సైబర్ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఫేస్ బుక్ పాస్ వర్డ్ ల విషయంపై గతంలోనే  'క్రెబ్స్‌ ఆన్‌ సెక్యూరిటీ డాట్ కామ్‌' అనే సెక్యూరిటీ న్యూస్‌ వెబ్‌ సైట్‌ ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 60 కోట్ల మంది పాస్ వర్డ్ లు సాధారణ అక్షరాల్లో (కామన్ లెటర్స్ లో ) ఉన్నాయని.. వీటిని సుమారు 20 వేల మంది (ఫేస్ బుక్) ఉద్యోగులు చూస్తున్నారని సంస్థ తెలిపింది.
Read Also : సోషల్ మీడియా ప్రచారం : వచ్చిన టీడీపీ టికెట్ పోయింది

Face Book
Plain Text Format
Servers
Store
users
Passwords
employees
Krebs on Security.com


మరిన్ని వార్తలు