చెక్ చేసుకోండి మీరు : 300 కోట్ల అకౌంట్లు తీసేసిన ఫేస్ బుక్

Submitted on 15 November 2019
Facebook removed 3.2 billion fake accounts between April and September, more than twice as many as last year

నకిలీ అకౌంట్‌ల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఫేస్‌బుక్ గతకొంత కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్​ మరో ముందగుడు వేసింది. నకిలీవిగా తేలిన దాదాపు 540 కోట్ల అకౌంట్లను ఇప్పటివరకు రద్దు చేసినట్లుగా ప్రకటించింది. అలాగే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 320కోట్ల అకౌంట్లు తీసేసినట్లు చెప్పింది. నకిలీ ఖాతాలను సృష్టించడానికి చేసే ప్రయత్నాలను పసిగట్టే పద్ధతులను మెరుగుపరుచుకోవడంతో పారదర్శకత వచ్చి ఫేక్ అకౌంట్లను తొలగించేందుకు సాయపడిందని ఫేస్‌బుక్ చెబుతుంది. 

సమాచారం ఎక్కడి నుంచి వస్తుందనేది తెలియని విధంగా వినియోగదారులను మభ్య పెట్టే ఖాతాలను అరికట్టడం సహా రాజకీయ, సామాజిక ఎజెండాలతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే వాటిని అరికట్టడానికి ఫేస్‌బుక్​ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు సంస్థధ తెలిపింది.. వినియోగదారుల సమాచారం కోరుతూ అమెరికా ప్రభుత్వం పంపిన అభ్యర్థనలు కూడా పెరిగినట్లు నివేదికలో స్పష్టమైంది.

ఈ ఏడాది ప్రథమార్ధంలో వివిధ దేశాల నుంచి ఒక లక్ష 28 వేల 617 అభ్యర్థనలు అందినట్లు వెల్లడించింది ఫేస్‌బుక్. ఖాతాదారుల సమాచారం కోరుతూ వచ్చిన అభ్యర్థనల్లో అమెరికా నుంచే అధికంగా ఉన్నట్లు చెప్పింది. తర్వాతి స్థానాల్లో భారత్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రభుత్వం నుంచి వచ్చే అభ్యర్థనలు న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయో లేదో అనేది ఖాతా సమాచారాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకుని వెల్లడిస్తామని ఫేస్‌ బుక్‌ తెలిపింది. ఫేస్‌ బుక్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారీగా ఫేక్‌ ఖాతాలు, తప్పుడు సమాచారాలకు బ్రేక్‌ పడనున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.

Facebook
3.2 billion fake accounts
APRIL
september
Last Year

మరిన్ని వార్తలు