ఫేస్‌బుక్ నుంచి డబ్బులు పంపొచ్చు

Submitted on 25 May 2019
Facebook plans to launch 'GlobalCoin'

గూగుల్ పే, ఫోన్ పే.. లానే ఫేస్ బుక్ కూడా నగదు లావాదేవీలు చేసే  సౌకర్యాన్ని తీసుకురానుంది. 2020 మార్చి నాటికి దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు జూకర్ బర్గ్ వెల్లడించారు. ముందుగా ఈ సదుపాయాన్ని 12దేశాల్లో అమలు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ యూజర్లకు త్వరలోనే అందించనున్నారు. 

ఇప్పటికే దీనిపై ప్రాజెక్టు రెడీ చేసుకున్న ఫేస్‌బుక్ యాజమాన్యం సంబంధిత అధికారులను కలిసి చర్చించింది. 'నగదు లావాదేవీలు సులభతరం చేయడానికి ఇదొక అవకాశం. ఫేస్‌బుక్‌లో ఫొటో పంపినంత సులువుగా డబ్బు పంపుకోవచ్చు' అని జూకర్ బర్గ్ వెల్లడించారు. 

కరెన్సీ ఒక్కో దేశంలో వేర్వేరు రూపాల్లో వేర్వేరు విలువలతో ఉంటుంది. దానిని కూడా సమన్వయం చేసుకునేలా దీనిని రూపొందించనున్నారు. యూఎస్ డాలర్, జపనీస్ యెన్, యూరోలు ఇలా అన్నింటికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. 

మార్కెట్‌లోకి తీసుకురాకముందే దీని కోసం పెట్టుబడిదారులను, ఎడ్వర్టైజ్‌మెంట్‌లను ఫేస్‌బుక్ ఆహ్వానం పంపింది. ఆన్‌లైన్ షాపింగ్, రిటైలర్‌ల నుంచి యాడ్‌లు ముందుగానే బుక్ చేసుకోవచ్చంటూ తెలిపింది. 

Facebook
MONEY TRANSACTION
Mark Zuckerbergs next big plan
mark zuckerberg

మరిన్ని వార్తలు