డిలీట్: ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో కొత్త ఫీచర్

Submitted on 6 February 2019
Facebook now lets you unsend messages on Messenger

ఫేస్ బుక్ మెసేంజర్ వాడుతున్నారా?  స్నేహితులకు, బంధువులకు ఎంతోమందికి ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ నుంచి మెసేజ్ లు పంపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మీరు అనుకోకుండా తప్పుగా మెసేజ్ పంపిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. మెసేజ్ పంపాల్సిన గ్రూపుకు బదులుగా పొరపాటున ఫేస్ బుక్ మరో గ్రూపులోకి మెసేజ్ ను పంపి ఉంటారు. తరువాత అయ్యో.. భలే పనైందే అని బాధపడుతుంటారు. పంపిన రాంగ్ మెసేజ్ ను డిలీట్ చేయలేక హైరానా పడుతుంటారు. మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉంటారు.


డోంట్ వర్రీ.. డిలీట్ ఫీచర్ ఉండగా..
ఇకపై రాంగ్ మెసేజ్ లపై వర్రీ కావాల్సిన పనిలేదు. మీకో గుడ్ న్యూస్. మీ ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ లో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఫేస్ బుక్ మెసేంజర్ రాంగ్ మెసేజ్ లను డిలీట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే. డిలీట్ ఫర్ ఎవరీవన్ (Delete For Everyone). ప్రపంచవ్యాప్తంగా Android, IOS platforms (ఆండ్రాయిడ్, ఐఓఎస్) ప్లాట్ ఫాం స్మార్ట్ ఫోన్లపై ఈ ఫీచర్ పొందొచ్చు.


పొరపాటున మెసేంజర్ చాట్ బాక్స్ లో రాంగ్ మెసేజ్ టైప్ చేసిన వర్రీ కావొద్దు. అవతల వారు ఆ మెసేజ్ చూడకముందే డిలీట్ చేయొచ్చు. ఇప్పటివరకూ ఫేస్ బుక్ మెసేంజర్ లో ఈ సదుపాయం లేదు. దీంతో రాంగ్ మెసేజ్ ను పంపి డిలీట్ చేయడం సాధ్యమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఫేస్ బుక్ మెసేంజర్ కొత్త ఫీచర్ రావడంతో సులువుగా చాట్ బాక్స్ లోని రాంగ్ మెసేజ్ ను డిలీట్ చేయెచ్చు. 


10 నిమిషాలే.. లేదంటే కష్టమే
పంపిన రాంగ్ మెసేజ్ ను 10 నిమిషాల్లోనే తప్పక డిలీట్ చేయాలి. లేదంటే.. మీ రాంగ్ మెసేజ్ అవతల వారు చదివేస్తారు. రాంగ్ మెసేజ్ ను డిలీట్ చేసే ముందు.. మెసేజ్ పై ప్రెస్ చేయాలి. వెంటనే మీకు డిలీట్ ఫర్ ఎవరీవన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ డిలీట్ బటన్ పై క్లిక్ చేస్తే చాలు.. మీ రాంగ్ మెసేజ్ డిలీట్ అయిపోతుంది. అక్కడ మెసేజ్ డిలీట్ అయినట్టుగా Removed msg అని కనిపిస్తుంది. అంటే.. మీరు ఎవరికైతే పంపారో వారికి మెసేజ్ డిలీట్ అయినట్టుగా మాత్రమే తెలుస్తుంది. ఏ మెసేజ్ డిలీట్ చేసారో తెలియదు. రాంగ్ మెసేజ్ డిలీట్ చేసే సమయాన్ని ఫేస్ బుక్ 10 నిమిషాల వరకే ఇచ్చింది. 

 

అదే వాట్సప్ (Watsapp) లో అయితే సుమారు గంటవరకు సమయం ఉంటుంది. వాట్సప్ గ్రూపులో పెట్టిన రాంగ్ మెసేజ్ ను ఎవరూ చూడకముందే వెంటనే డిలీట్ చేయొచ్చు. ఇందులో కూడా డిలీట్ ఫర్ ఎవరీవన్, డిలీట్ ఫర్ మీ అనే రెండు ఫీచర్లు ఉన్నాయి. మీ చాట్ బాక్సులో మాత్రమే మెసేజ్ డిలీట్ చేయాలంటే చేయొచ్చు. లేదంటే.. గ్రూపులో ఎవరికి కనిపించక ముందే మెసేజ్ ను డిలీట్ చేయాల్సి ఉంటుంది. 

Facebook
unsend messages
Messenger
Android
iOS platforms  

మరిన్ని వార్తలు