యూజర్ల దెబ్బకు వెనక్కి తగ్గిన Whatsapp

Submitted on 21 January 2020
Facebook drops plans to sell ads in WhatsApp

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ తోక ముడిచింది. యూజర్లు ఇచ్చిన్ షాక్ తో కంపెనీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తరహాలో వాట్సాప్ ప్లాట్ ఫాంపై కూడా యాడ్స్ డిస్ ప్లే చేయాలనే నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. Whatsapp Status దగ్గర యాడ్స్ డిస్ ప్లే చేస్తామని Facebook ప్రకటించడాన్ని యూజర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

తమ సొంత యాప్ Whatsapp లో Ad ఫీచర్ తీసుకురాబోతున్నట్టు గత ఏడాదిలోనే ఫేస్ బుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. వాట్సాప్ లో ఇంటిగ్రేటెడ్ Ads డిస్ ప్లే చేయడంపై వాట్సాప్ టీమ్ వర్క్ చేస్తున్నట్టు ఇటీవలే వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్టు వెల్లడించింది. అయితే, ఆ వాట్సాప్ టీమ్.. వాట్సాప్ కోడ్ నుంచి ఆ ఫీచర్ డిలీట్ చేసినట్టు నివేదిక పేర్కొంది. 

యూజర్లే కాదు.. ఈ ఇద్దరూ కూడా :
వాట్సాప్ స్టేటస్ ఫీచర్ గా యాడ్స్ తీసుకురావాలనే ఆలోచనను యూజర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. వాట్సాప్ లో యాడ్స్ విషయంలో మాత్రమే యూజర్లు అసంతృప్తి లేరు. 2017లో వాట్సాప్ వ్యవస్థాపకులు అక్టాన్, కుయూమ్.. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తో విభేదాలు వచ్చాయి. దీంతో వారిద్దరూ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అప్పుడు కూడా వాట్సాప్ మెసేజింగ్ యాప్ లో చాట్స్ మధ్య ఇన్ఫూజ్ యాడ్స్ డిస్ ప్లే చేయాలనే జుకర్ బర్గ్ నిర్ణయాన్ని వారిద్దరూ వ్యతిరేకించారు. మరుసటి రోజున అక్టాన్ ఫోర్బ్స్ తో మాట్లాడుతూ.. ‘నా కంపెనీని అమ్మేశాను. మై యూజర్స్ ప్రైవసీ కూడా అమ్మేశాను. రాజీ పడాలా లేదా అనేది ఒకటి ఎంచుకున్నాను’ అని తెలిపారు. 

2014లో ఫేస్ బుక్ వాట్సాప్ నుంచి 22 బిలియన్ల డాలర్లు సంపాదించింది. 2009లో ప్రవేశపెట్టిన వాట్సాప్ అనేది.. ఈ రోజున ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్ లోడ్ అయిన యాప్ గా రికార్డు సృష్టించింది. ఈ యాప్ ప్రారంభంలో డౌన్ లోడ్ ఫీజు.. సబ్ స్ర్కిప్షన్ ఫీజు 0.99 డాలర్లుగా ఉండేది. ఆ తర్వాత ఫేస్ బుక్ తమ యూజర్ల సౌకర్యార్థం 2019 నుంచి ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

అదే ఏడాదిలోనే వాట్సాప్ లో కూడా ఇన్ స్టాగ్రామ్ తరహాలో యాడ్స్ ప్రవేశపెట్టాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయానికి భారీ స్థాయిలో యూజర్లందరి నుంచి వ్యతిరేకత రావడంతో ఫేస్ బుక్ యాడ్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. 

Facebook
sell ads
WhatsApp
messaging app
instagram stories  

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు