ఇండియాలో సైబర్ దాడులకు ఇక చెక్!

Submitted on 9 January 2019
EY, IBM to launch advanced security operations centres in india to tackle cyber attacks
  • ఈవై, ఐబీఎం సంస్థల ప్రకటన.. 

  • అడ్వాన్స్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్లు లాంచ్

ఇప్పుడు అంతా ఆన్ లైన్.. ప్రతి సమాచారం ఇక్కడే దొరుకుతుంది. చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ప్రతి కంపెనీ తమ డేటాను ఇక్కడే భద్రపరుచుకుంటాయి. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ దాడులకు పాల్పడి విలువైన డేటాను, కోట్లాది డబ్బును కాజేస్తున్నారు. ఎన్ని భద్రత వ్యవస్థలను పటిష్టం చేసినప్పటికీ ఇలాంటి సైబర్ నేరగాళ్ల నిఘా నుంచి డేటాను కాపాడుకోలేకపోతున్నారు. ఇది ఒక్క దేశానికి సంబంధించిన సమస్య కానే కాదు. ప్రపంచంలోని అగ్రదేశాల నుంచి మొదలుకొని పేద దేశాల వరకు అన్ని దేశాల్లో సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. ప్రపంచ దేశాలను సైబర్ దాడులు వణికిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సైబర్ నేరగాళ్ల నుంచి ఆన్ లైన్ లో విలువైన డేటాను కాపాడుకోలేమా అంటే.. కాపాడుకోగలం. అందుకు ఓ అత్యంత భద్రతతో కూడిన సెక్యూరిటీ టెక్నాలజీ అవసరం. అందుకే కంప్యూటర్ సిస్టమ్ లపై సైబర్ నేరగాళ్ల దాడులను నిరోధించేందుకు గ్లోబల్ ప్రొఫెసనల్ సర్వీసెస్ కంపెనీ ఈవై.. సరికొత్త అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తేస్తోంది. 

ఇందుకోసం ఐబీఎం కంపెనీతో కలిసి ఈవై బుధవారం ప్రకటన విడుదల చేసింది. అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్స్ (ఎస్ఓఎస్)ను భారత్ లో ప్రారంభించనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఐబీఎం ‘క్యూరాడర్’ ప్లాట్ ఫాంపై ఈవై పలు సర్వీసులను అందిస్తోంది. సైబర్ దాడులను ముందుగానే డిటెక్ట్ చేసేలా ఈ ఎస్ఓఎస్ సెంటర్లను రూపొందించారు. ఏ అడ్రస్ నుంచి సైబర్ దాడులు జరగబోతున్నాయి, రిస్క్స్ ఏంటి.. ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఈ ఎస్ఓఎస్ సెంటర్లు డిటెక్ట్ చేస్తాయని ఈవై కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సైబర్ దాడులను ముందుగానే గుర్తించి వాటిని నిరోధించడంలో సెక్యూరిటీ ఫంక్షన్స్ ను అలర్ట్ చేయడంలో ఈ ఎస్ఓసీ అత్యంత వేగవంతంగా పనిచేస్తుందనిసైబర్ సెక్యూరిటీ పార్టనర్ ఈవై ఇండియా బర్గెస్ కోపర్ తెలిపారు. ఎస్ఓసీ ఒక ఇంటర్నెల్, ఎక్స్ ట్రనల్ థ్రెట్స్ ఇంటెలిజెన్స్ ను అందించడమే కాదు.. సైబర్ దాడుల ముప్పులను ముందుగానే పసిగట్టి నిరోధిస్తుంది. 

ఇటీవల ఈవై నిర్వహించిన గ్లోబల్ ఇన్మరేషన్ సెక్యూరిటీ సర్వే (జీఐఎస్ఎస్) ప్రకారం.. 2018లో 77 శాతం భారత సంస్థలు తమ వ్యాపార కార్యకలపాలు సమర్థవంతంగా పనిచేసేందుకు సైబర్ సెక్యూరిటీ ఫ్రేం వర్క్, ఆర్కిటెక్చర్ ను తిరిగి రీవర్క్ చేయిస్తున్నట్టు వెల్లడించింది.

EY
IBM
advanced security
operations centres
SOC
cyber attacks

మరిన్ని వార్తలు