ఏరా అంటూ పిలిచిన నెటిజన్.. మెగా హీరో అదిరిపోయే పంచ్

Submitted on 15 November 2019
Extrordinary Responce to fan By Mega Hero Sai Dharam Tej in Twitter

మెగా మేనల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్. వైవియస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ సినిమాతో మొదటగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చినా.. ఫస్ట్ సినిమా మాత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం' థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాడ న‌వంబ‌ర్ 14, 2014న విడుదలైంది. మేనమామలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ మేనరిజమ్‌లను ఇమిటేట్ చేస్తూ ప్రేక్షకులకి ఈజీగా కనెక్ట్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. తర్వాత సుబ్రహ్మణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్ ఇలా మంచి సినిమాలను అందిచాడు సాయి ధరమ్ తేజ్.

అయితే వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సాయిధరమ్ తేజ్ పని అయిపోయింది అనుకున్న సమయంలో చిత్రలహరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఆచితూచి సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం సాయి చేతిలో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. అందులో మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు. అలాగే ‘సోలో బతుకే సో బెటర్’ అనే టైటిల్‌తో ఓ సినిమాను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో కూడా సాయి ధరమ్ తేజ్ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. అభిమానులకు రిప్లై ఇస్తూ ఉంటారు కూడా. లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఏరా సినిమాలో కామెడీ ఈ రేంజ్‌లో ఉంటుందా? అంటూ ఏకవచనంతో పిలుస్తూ కామెంట్ చేశాడు. అయితే ఆ మెసేజ్ కు కోపడగించుకోకుండా అంతే సరదాగా రిప్లై ఇచ్చారు సాయి ధరమ్ తేజ్.

లేదురా దీనికి వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో షాక్ అయిన అభిమాని బ్రహ్మానందం ఫోటో పెట్టాడు. దానికి కూడా బ్రహ్మానందం ఫోటో పెట్టాడు సాయి ధరమ్ తేజ్. చివరకు ఏదో తెలియక కామెంట్ చేశాను అన్న గుడ్ లక్ అని చెప్పేశాడు నెటిజన్. ఈ కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 

Sai Dharam Tej
Prathi Roju Pandage
Mega Hero

మరిన్ని వార్తలు