లగడపాటి సన్యాసం : జన్మలో సర్వేలు చేయను

Submitted on 24 May 2019
EX Mp Lagadapati Release Press Note

ఇక సర్వేలు చేయను..తన వల్ల ఎవరైనా నొచ్చుకుంటే మన్నించండి.. ప్రజల నాడి పట్టుకోవడంలో విఫలమయ్యా అంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఇక సర్వేల జోలికి వెళ్లనని చెప్పారు. మే 24వ తేదీన ఓ లేఖ విడుదల చేశారు. లేఖలో బహిరంగ క్షమాపణ కోరారు లగడపాటి. డిసెంబర్ 2018, 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నట్లు వెల్లడించారు. కారణాలు ఏమైనా రెండుసార్లు విఫలైనందుకు..ఇక మున్ముందు సర్వేలు చేయనని స్పష్టం చేశారు. 

2014లో కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడినట్లు..ఎంపీగా చేసి రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన అనంతరం ఏ రాజకీయ పార్టీలో చేరలేదని చెప్పారు. 2004 సంవత్సరం నుంచి కూడా సర్వేలు ఒక వ్యాపకంగా మారాయని, ఎవరికి అనుకూలమైన లేక వ్యతిరేకమైనా.. సొంత పార్టీ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఉన్నా..పక్షపాతం లేకుండా అనేక సర్వేలు చేయటం జరిగిందన్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తనకు అందిన సర్వే ఫలితాలను మీడియాకు వివరించినట్లు.. ఈ ఫలితాల వల్ల  ఎవరైనా..ఏ పార్టీ అయినా..నొచ్చుకుని ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మాణాత్మకుడిగా.. రాష్ట్రాభివృద్ధికి నూతన ప్రభుత్వానికి బాబు తోడ్పాటు అందిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు లేఖలో ద్వారా ఆకాక్షించారు లగడపాటి రాజగోపాల్.

EX Mp Lagadapati
release
Press Note
lagadapati survey

మరిన్ని వార్తలు