కవిత భావోద్వేగం : కవిత ఓడిపోయిందని చనిపోయాడు

Submitted on 27 May 2019
Ex MP Kavitha Emotion with the activist's death

రాజకీయాల్లో గెలుపు..ఓటములు సహజం..కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని నిజామాబాద్ TRS ఎంపీ అభ్యర్థిగా పరాజయం చెందిన కవిత సూచించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్‌ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కిషోర్‌ కుమార్‌ మే 24వ తేదీన శుక్రవారం గుండెపోటుతో మృతి చెందడంతో కల్వకుంట్ల కవిత చలించిపోయారు. తన ఓటమిని తట్టుకోలేక మనస్థాపంతో కిషోర్‌ గుండెపోటుకు గురై మృతి చెందాడని తెలిసి ఆమె భావోగ్వేదానికి గురయ్యారు. మే 27వ తేదీ సోమవారం కిషోర్ కుమార్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...రాజకీయాల్లో గెలుపోటములు, ఒడిదొడుకులు ఉంటాయని కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలన్నారు కవిత. కిషోర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. పదవులకంటే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం టీఆర్ఎస్ పనిచేస్తుందని..తాను ఎక్కడకు పోనని..నిజామాబాద్‌లో ఉంటానని పదవులున్నా, లేకపోయినా..తప్పకుండా పనిచేస్తానన్నారు కవిత. 

Ex MP
Kavitha Emotion
TRS activist's death
nizamabad
nizamabad MP

మరిన్ని వార్తలు