బీజేపీలోకి క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్

Submitted on 22 March 2019
Ex-Cricketer Gautam Gambhir Joins BJP

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ బీజేపీ గూటికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా తన ఆటతీరుతో ఎందరో అభిమానలను దక్కించుకున్న గౌతమ్ గంభీర్.. అరుణ్ జైట్లీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా గంభీర్‌ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు రాగా ఆ వార్తలను నిజం చేస్తూ  ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.
Read Also : వీధుల్లో కొట్టుకున్నారు : ఉండిలో టీడీపీ - వైసీపీ రాళ్ల దాడులు

గంభీర్‌ను ఢిల్లీలోని ఓ స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన గౌతమ్ గంభీర్.. ప్రధాని మోడీ నిర్ణయాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. తనకు పార్టీలో చేరే అవకాశం ఇచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నానని గంభీర్‌ తెలిపారు. 

దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై స్పందిస్తుండే గంభీర్‌.. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి అంశంలో కూడా పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టారు. బీజేపీలో చేరిన ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామంటూ బీజేపీ కూడా చెబుతుంది. పార్టీ సెలక్షన్ కమిటీ గంబీర్‌కు ఎటువంటి బాధ్యతలు అప్పగించాలనే విషయంపై సమాలోచనలు జరుపుతుందని చెప్పారు. ఇటీవలే గంభీర్‌కు పద్మా పురస్కారం కూడా లభించింది.  
Read Also : ప్రకాశం రచ్చ : వల్లూరమ్మ గుడిలో దామచర్ల - బాలినేని వర్గాల ఘర్షణ

Ex-Cricketer Gautam Gambhir
BJP

మరిన్ని వార్తలు