లంచం కేసులో Cognizant మాజీ COOకు భారీ జరిమానా

Submitted on 17 September 2019
Ex-Cognizant COO Sridhar Thiruvengadam to pay $50,000 fine in bribery case

లంచం కేసులో కాగ్నిజెంట్ మాజీ సీఓఓ శ్రీధర్ తిరువెంగడమ్ 50వేల డాలర్ల సివిల్ పెనాల్టీ చెల్లించేందుకు అంగీకరించారు. సెక్యూరిటీస్ ఎక్సేంజ్ అండ్ కమిషన్ (SEC) ఆదేశాలనుసారం ఆయన జరిమానా చెల్లించనున్నట్టు తెలిపారు. ఈ కేసులో శ్రీధర్‌తో పాటు కంపెనీలోని నలుగురు ఎగ్జిక్యూటీవ్‌లు నిందితులుగా ఉన్నారు. ఓ వీడియో కాన్ఫిరెన్స్ లో లంచం చెల్లింపునకు మాజీతో సహా నలుగురు కంపెనీ అధికారులు అధికారం ఇచ్చినట్లు తేలింది.

ఈ కేసుకు సంబంధించి చెన్నైలోని పాత మహాబలిపురంలో కాగ్నిజెంట్ కు చెందిన 2.7కు మిలియన్ల చదరుపు అడుగుల విస్తీర్ణంలో KITS క్యాంపస్ ఉంది. ఇందులో 17వేల 500 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. క్యాంపస్ బాధ్యులైన నిర్మాణ సంస్థ నుంచి 2 మిలియన్ల డాలర్లు లంచాన్ని తమిళనాడుకు చెందిన ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి డిమాండ్ చేశారు. లంచాన్ని చెల్లించేలా ప్రేరేపించడంతో కాగ్నిజెంట్‌ కంపెనీ పౌర, క్రిమినల్ చర్యలకు గురైంది.

అంతేకాదు.. కంపెనీ 25 మిలియన్ల డాలర్లు వరకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు అంతర్గత దర్యాప్తుకు సంబంధించి 79 మిలియన్ డాలర్లు వరకు ఎక్కువగా ఖర్చు చేసింది. తాజా SEC ఉత్తర్వుల ప్రకారం.. కంపెనీ పుస్తకాల్లో స్కీమ్‌ను కప్పిపుచ్చడానికి తిరువెంగడం ఒక పథకం పన్నినట్టు SIC ఉత్తర్వులో పేర్కొంది. 2013 చివరి నుంచి 2016 ఆఖరిలో అడ్మినిస్ట్రేటివ్ సెలవులో ఉండేంత వరకు కాగ్నిజెంట్ COOగా తిరువెంగడమ్ ఉన్నారు. గత ఏడాదిలోనే తిరువెంగాడమ్ రాజీనామాను కాగ్నిజెంట్ అంగీకరించింది. 

తప్పుడు ఉప ధృవపత్రాలపై సంతకం చేయడం ద్వారా చెల్లింపును దాచడానికి తిరువెంగడం ప్రయత్నించినట్టు SIC ఉత్తర్వులో పేర్కొంది. తిరువెంగడం FCPA అంతర్గత అకౌంటింగ్ నియంత్రణలు, రికార్డ్ కీపింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. విచారణలో కనిపెట్టిన విషయాలను అంగీకరించకుండా లేదా తిరస్కరించకుండా తిరువెంగడం సివిల్ జరిమానా 50వేల డాలర్లు చెల్లించడానికి అంగీకరించారు’ అని ఉత్తర్వులో పేర్కొంది. 

Ex-Cognizant
COO
Sridhar Thiruvengadam
bribery case 

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు