క్యాస్టే నా ప్రాబ్లమ్..

Submitted on 15 February 2019
Evvarikee Cheppoddu Movie official teaser-10TV

బాహుబలి 2 లో సేతుపతి క్యారెక్టర్‌తో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు రాకేష్ హీరోగా నటిస్తున్న సినిమా.. ఎవ్వరికీ చెప్పొద్దు.. గార్గేయి ఎల్లాప్రగడ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, హీరోగా నటిస్తున్న రాకేషే నిర్మిస్తున్నాడు. బసవ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఎవ్వరికీ చెప్పొద్దు టీజర్ రిలీజ్ చేసారు. 40 సెకన్ల ఈ టీజర్ సింపుల్‌గా బాగుంది. నాతో కాఫీకి రా, ఒక్కసారి డేర్ చేసి చూడు.. అనే రాకేష్ వాయిస్ ఓవర్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్‌ని కలవడానికి హీరో.. కాఫీ షాప్‌ కెళ్తాడు. హీరోయిన్ : నేను నిన్ను కలవడం ఇంక కుదరదు, ఇది చెప్దామనే కలుద్దామన్నా.. అంటే, హీరో : అదేంటి, మళ్ళీ ఏమైంది, నిన్న కూడా బాగానే ఉన్నావ్ కదా.. అసలు ప్రాబ్లమ్ ఏంటి? అనడగ్గానే.. హీరోయిన్ : క్యాస్ట్ ప్రాబ్లమ్.. అని చెప్పడం, హీరో ఆశ్చర్యపోవడం..

హీరోయిన్ : మీ క్యాస్ట్ ఏంటి? అనడగడం.. పక్కనున్న వ్యక్తి విచిత్రంగా చూడడం, హీరోయిన్ మళ్ళీ, మీరేంటీ? అని నొక్కి మరీ అడిగితే, హీరో సైలెంట్ అవడం.. టీజర్ క్యూట్‌గా ఉంది.. త్వరలో ఎవ్వరికీ చెప్పొద్దు రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కెమెరా : విజయ్.జె.ఆనంద్, ఎడిటర్స్ : బసవ శంకర్, తేజ ఎర్రంశెట్టి, సత్యజిత్ సుగ్గు, మ్యూజిక్ : శంకర్ శర్మ, లిరిక్స్ : వాసు, లైన్ ప్రొడ్యూసర్ : కేతన్ కుమార్.  

వాచ్ టీజర్...

Rakesh Varre
Gargeyi Yellapragada
Sankar Sharma
Basava Shanker

మరిన్ని వార్తలు