బ్రేకింగ్ : ఆ ఇంట్లోకి EVM, వీవీ ప్యాట్ ఎలా వచ్చాయ్

Submitted on 16 April 2019
EVM In Telangana and Maharashtra Border

ఈవీఎం తరలింపులో ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అవుతోందని, ఈవీఎంలన్నీ సవ్యంగా తరలించామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించిన కొద్దిసేపటికే ఓ EVM ఓ వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. ఇది అసలు ఇక్కడకు ఎలా వచ్చింది ? ఎవరు తరలించారో తెలియరావడం లేదు.
Read Also : మరలా బాబే సీఎం : YCP అరాచకాన్ని అణిచివేస్తాం - బుద్ధా

ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ఈవీఎం బయటపడింది. స్థానికంగా ఉన్న మదన్ సింగ్ రాథోడ్ ఇంట్లో సీలు వేసి ఉన్న ఈవీఎం, ఓ బ్యాగు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రదేశానికి వారు చేరుకుని ఆరా తీస్తున్నారు. ఈవీఎంపై 692 నెంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మే 23న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అయితే ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లయింట్స్ చేస్తున్నారు. స్ట్రాంగ్ రూంలో ఉన్న ఈవీఎంల భద్రతపై నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్న సమయంలో ఈవీఎం బయటపడడం సంచలనం స‌ృష్టిస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

EVM
Telangana
Maharashtra
Border
Telangana Election
Election 2019

మరిన్ని వార్తలు