చలాన్లు కట్టలేకే కిడ్నీలు అమ్మేశాం : ఆపిల్ ఐఫోన్ 11 లాంచ్.. డబ్బుల్లేవ్!

Submitted on 10 September 2019
Everyone Thought Of The Same Joke Ahead Of Apple's iPhone 11 Launch

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. సెప్టెంబర్ 10న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఫస్ట్ టైం యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తోంది. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా ఆపిల్ స్పెషల్ ఈవెంట్ జరుగనుంది. ఆపిల్ తమ అధికారిక ట్విట్టర్ తో పాటు సొంత వెబ్ సైట్ మాత్రమే కాకుండా యూట్యూబ్ లో కూడా లైవ్ స్ట్రీమింగ్ కోసం ఇప్పటికే షెడ్యూల్ సెట్ చేసింది.

మరి కొన్నిగంటల్లో ఆపిల్ స్పెషల్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఆపిల్ గ్రాండ్ ఈవెంట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ట్రాఫిక్ కొత్త చట్టం రూల్స్‌తో ఆపిల్ ఈవెంట్ కు ముడి పెట్టేసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పేలుస్తున్నారు. నిజానికి ఆపిల్ ప్రొడక్టులు మార్కెట్లో ఎంతో ఖరీదైనవి. అత్యంత ఖరీదైన ఐఫోన్ల ధరలు చూస్తే సామాన్యుడు కొనే పరిస్థితి లేదు. 

ఈ క్రమంలో ఆపిల్ ఫోన్లకు.. ట్రాఫిక్ చలాన్లతో వేస్తున్న భారీ జరిమానాలకు లింక్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘డియర్ @ఆపిల్.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద భారీ జరిమానాలు కట్టలేక కిడ్నీలు అమ్మేసుకునే పరిస్థితి ఉంది. ఈ సమయంలో అత్యంత ఖరీదైన మీ ఐఫోన్ 11 సిరీస్ కొనాలంటే మరికొన్ని అవయవాలను పేమెంట్ గా ఇవ్వాల్సి వస్తుంది. #ఆపిల్ ఈవెంట్ అని హ్యాష్ ట్యాగ్ జోడించి ఓ యూజర్ ట్వీట్ చేశారు.

చాలామంది ట్విట్టర్ యూజర్లు ఇదే జోక్ ను రీట్వీట్ చేస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరో ట్విట్టర్ యూజర్ ఫన్నీగా.. ‘ఆపిల్ ఐఫోన్ 11 కొనేందుకు కొత్త పేమెంట్ ఆప్షన్ ఇచ్చింది. #appleevent అంటూ ఓ ఇమేజ్ పోస్టు చేశాడు. అందులో డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు కిడ్నీని కూడా పేమెంట్ ఆప్షన్ గా ఉంచాడు. ఆపిల్ ఈ ఏడాది కొత్త బ్రాండ్ పేమెంట్ ఆప్షన్ తీసుకొచ్చిందని మరో యూజర్ ట్వీట్ చేశాడు. 

ఆపిల్ కంపెనీ తొలిసారి యూట్యూబ్ లో స్పెషల్ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఈవెంట్ లో కొత్త ఐఫోన్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఆపిల్ ఎ13 చిప్ కూడా రిలీజ్ కానున్నట్టు రుమర్లు వస్తున్నాయి. కొత్త ఆపిల్ వాచ్, ఆపిల్ వాచ్ సిరీస్ 5 ఇలా మరెన్నో కొత్త ప్రొడక్టులను ప్రకటించించే అవకాశం ఉంది. 2018 ఏడాదిలో ఆపిల్ తమ ఐఫోన్ ఈవెంట్ ను ట్విట్టర్ వేదికగా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చింది. 

Apple
iPhone 11 launch
kidney
violation of traffic rules
Twitter users 

మరిన్ని వార్తలు