ఎర్రన్న ఇంట సైకిల్ దూకుడు

Submitted on 24 May 2019
Errana Family Members Win  In AP Election 2019

ఎర్రన్న కుటుంబం నుంచి రాజకీయ వారసులుగా అడుగుపెట్టిన ప్రతొక్కరూ ప్రజల మన్ననలను పొందిన వారే. 2019 ఎన్నికల్లో దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు కుటుంబ వారసులంతా విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా ఎర్రన్న ఇంట మాత్రం సైకిల్ దూకుడు కొనసాగింది. తొలిసారిగా రాజమండ్రి అర్బన్ శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఎర్రన్న కుమార్తె ఆదిరెడ్డి భవాని 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఎర్రన్న సోదరుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో వరుసగా రెండో సారి గెలుపొంది చరిత్ర సృష్టించారు. 8,857 ఓట్లతో శాసనసభ్యునిగా విజయం సాధించారు. ఈయనకు 86 వేల 626 ఓట్లు రాగా..పేరాడ తిలక్ (వైసీపీ) 77 వేల 769 ఓట్లు వచ్చాయి. 

శ్రీకాకుళం ఎంపీగా ఎర్రన్న కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా రెండోసారి గెలిచారు. ఉత్కంఠ రేపిన ఎంపీ నియోజకవర్గ ఫలితాలలో 8 వేల 282 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈయనకు 5 లక్షల 29 వేల 213 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి అయిన దువ్వాడ శ్రీనివాస్ (వైసీపీ)కి 5 లక్షల 20 వేల 931 ఓట్లు వచ్చాయి. ఒకే ఇంటి నుంచి బరిలోకి దిగిన వీరు ముగ్గురిని ప్రజలు ఆశీర్వదించడం విశేషం. 

Errana Family
Members
win
AP Election 2019
Kinjarapu
Naidu

మరిన్ని వార్తలు