కర్నూలు టీడీపీకి షాక్ : జగన్‌తో ఇరిగెల సోదరులు భేటీ

Submitted on 16 February 2019
Erigela Brothers Likely To Join YSR Congress, Kurnool Politics

కర్నూలు : ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ నేతలు వైసీపీలోకి క్యూ కట్టారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ప్రముఖ వ్యాపార వేత్త దాసరి జై రమేష్‌ త్వరలో వైసీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

 

ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ కీలక నేతలు, ఇరిగెల బద్రర్స్ ఫ్యాన్ గాలిలో సేద తీరాలని చూస్తున్నారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి, ప్రతాప్ రెడ్డిలు వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారని సమాచారం. 2019, ఫిబ్రవరి 16వ తేదీ శనివారం ఉదయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డితో ఇరిగెల సోదరులు భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం. శిల్పా మోహన్ రెడ్డి ఇరిగెల సోదరులను జగన్ దగ్గరకు తీసుకొచ్చారు. రాంపుల్లారెడ్డి ఆళ్లగడ్డలో టీడీపీ కీలకనేత.. గతంలో టీడీపీ ఇంచార్జ్‌‌గా పనిచేశారు.

Read Also: అప్పుడే అయిపోలేదు : వైసీపీలోకి మరో 30మంది టీడీపీ నేతలు

Read Also: వీడ్ని ఏం చేసినా పాపం లేదు : ఉగ్రదాడిని సమర్థించిన విద్యార్థి

kurnool tdp
shock for tdp
erigela brothers to join ysrcp
erigela rampulla reddy
erigela pratap reddy
Allagadda
cm chandrababu
Ys Jagan

మరిన్ని వార్తలు