రోహిత్, గేల్, డివిలియర్స్‌లను దాటేసిన మోర్గాన్

Submitted on 18 June 2019
 Eoin Morgan Breaks World Record

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ వరల్డ్ కప్ టోర్నీలో సిక్సుల రికార్డు సృష్టించాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న అఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో మోర్గాన్ 17సిక్సులు బాదాడు. బౌండరీలే హద్దుగా చెలరేగి(148; 71బంతుల్లో 4ఫోర్లు, 17సిక్సులు)స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  

ఈ మ్యాచ్‌తో ఒకే ఇన్నింగ్స్‌లో 16సిక్సులు కొట్టిన రోహిత్, డివిలియర్స్, క్రిస్ గేల్ రికార్డులను దాటేశాడు మోర్గాన్. క్రిస్ గేల్ కాన్బెర్రా వేదికగా 2015లో జరిగిన జింబాబ్వేతో మ్యాచ్‌లో అధిక సిక్సులు బాదాడు. వరల్డ్ కప్‌లో మోర్గాన్ సిక్సుల రికార్డు మాట అటుంచితే వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 24సిక్సులు బాది సంవత్సరారంభంలోనే రికార్డు సృష్టించాడు. 

అఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఒక్కడే ఇంగ్లాండ్ జట్టును అదుపు చేయగలడని భావించారు. కానీ, ముజీబ్ బౌలింగ్‌లోనే ఒక్క వికెట్ పడకుండా 44పరుగులు సమర్పించుకున్నాడు. మోర్గాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్‌నే టార్గెట్ చేసి బాదాడు. రషీద్ బౌలింగ్ చేసిన 9ఓవర్లలోనే మోర్గాన్ 100పరుగులు బాదేశాడు. 

Eoin Morgan
2019 icc world cup
world cup 2019
england
eng


మరిన్ని వార్తలు