‘రాముడు కూడా మంచోడేరా.. కానీ రావణాసూరుణ్ణి వేసెయ్యలా’?

Submitted on 9 October 2019
Entha Manchivaadavuraa - Teaser

‘మా మనవడు శివ.. మంచోళ్లకే మంచివాడు’.. అంటూ విజయ్ కుమార్.. మిగతా కుటుంబ సభ్యులు అందరూ కళ్యాణ్ రామ్ మంచి తనం గురించి చెప్పడంతో ‘ఎంత మంచివాడవురా’ టీజర్ స్టార్ట్ అవుతుంది. నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’..

ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో, ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ‘ఎంత మంచివాడవురా’ టీజర్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు.  ‘అందరూ మంచోడు, మంచోడు అంటున్నారు.. మరీ ఇలా కొడుతున్నావేంట్రా?.. అంటే.. ‘రాముడు కూడా మంచోడేరా.. కానీ రావణాసూరుణ్ణి వేసెయ్యలా’? అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ హైలెట్ అయ్యింది.

Read Also : వినాయక్ హీరోగా ‘సీనయ్య’ ప్రారంభం

‘మళ్లీ ఎప్పుడొస్తావ్ రా’? అని తనికెళ్ల భరణి అడగితే.. కళ్యాణ్ రామ్ ‘సంక్రాంతికి వస్తాను నాన్నా’ అని చెప్పడంతో టీజర్ ఎండ్ అవుతుంది. లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయనిపిస్తుంది.. 2020 సంక్రాంతికి ‘ఎంత మంచివాడవురా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : గోపి సుందర్, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : రామాంజనేయులు, ఫైట్స్ : వెంకట్.


 

Nandamuri Kalyan Ram
Mehreen
Umesh Gupta
Subhash Gupta
Gopi Sundar
Satish Vegesna

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు