న్యాయమూర్తి ఎదుట వేంపల్లి ఆదివాసీలు

Submitted on 16 June 2019
enquiry habeas corpus Over adivasi detention

ఆదివాసీల అక్రమ నిర్భందంపై హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు 67 మంది ఆదివాసీలను ప్రత్యేక బస్సులో జూన్ 16వ తేదీ ఆదివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు ఫారెస్టు ఆఫీసర్స్. అనంతరం కుందన్ బాగ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు హాజరు పరిచారు. కాగజ్ నగర్ వేంపల్లి గ్రామానికి చెందిన 16 కుటుంబాలను అటవీ శాఖ అధికారులు నిర్భందించారని పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారిస్తోంది. 

అటవీ శాఖాధికారులు అక్రమంగా నిర్భందించారని..వీరికి పునరావాసం కల్పించాలని పిటిషనర్ తరపున న్యాయవాది రఘునాథ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరిని తరలించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బలవంతంగా ఎవరినీ బంధించలేదని, ఇష్టపూర్వకంగానే వచ్చి ఫారెస్టు డిపోలో ఉంటున్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కొన్ని ఏళ్లుగా అడవిలోనే బతుకుతున్నారు. ఆదివాసీలు ఉంటున్న నివాసాలను ఫారెస్టు అధికారులు కూల్చివేసి అక్రమంగా నిర్భందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము ఇప్పటికిప్పుడు పోవాలంటే ఎక్కడకు పోవాలని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో హైకోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

enquiry
habeas
corpus
adivasi detention


మరిన్ని వార్తలు