అఫ్గాన్‌కు అందని ద్రాక్షే: ఇంగ్లాండ్ భారీ విజయం

Submitted on 18 June 2019
England won by 150 runs

తొలి విజయం కోసం ఎదురుచూసిన అఫ్గనిస్తాన్ కు మరోసారి నిరాశే మిగిలింది. వరల్డ్ కప్ టోర్నీలో బోణీ కొట్టాలని తహతహలాడిన పసికూనలు ఈ మ్యాచ్ ను కూడా పేలవంగానే ముగించారు. టాస్ ఓడి ఫీల్డింగ్ కు దిగిన అఫ్గాన్ .. ఇంగ్లాండ్ పరుగుల వరదను కట్టడి చేయలేకపోయారు. చేధనలోనూ విఫలమవడంతో 150పరుగుల తేడాతో ఓటమి చవిచూశారు. 398పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ ఏ దశలోనూ కోలుకుంటున్నట్లు కనిపించలేదు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. 

హష్మతుల్లా షహీది(76; 100 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సులు) చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేశాడు. అతనితో పాటు రహ్మత్ షా(46), అస్గర్ అఫ్గాన్(44)హాఫ్ సెంచరీకి చేరువై వికెట్ సమర్పించుకున్నారు. మిగిలిన బ్యాట్స్ మెన్ నూర్ అలీ(0), గులాబ్దీన్(37), మొహమ్మద్ నబీ(9), నజీబుల్లా జద్రాన్(15), రషీద్ ఖాన్(8), ఇక్రామ్ అలీ(3), జద్రాన్(0)తో సరిపెట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3), మార్క్ వుడ్(2), ఆదిల్ రషీద్(3)వికెట్లు పడగొట్టారు. 

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ పసికూనలపై రెచ్చిపోయింది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే రీతిలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పరుగుల వదర పారించారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక టార్గెట్‌ను సృష్టించి ఘనత సాధించారు. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి అఫ్ఘన్‌కు 398పరుగుల రికార్డు టార్గెట్ ఇచ్చారు.

గాయం నుంచి కోలుకున్న ఇయోన్ మోర్గాన్(148; 71బంతుల్లో 4ఫోర్లు, 17 సిక్సులు)తో అఫ్గన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బౌండరీలను శాసిస్తూ భారీ టార్గెట్ దిశగా దూసుకెళ్లింది. ఓపెనర్లు జేమ్స్(26; 31బంతుల్లో 3ఫోర్లు), జానీ బెయిర్ స్టో(90; 99బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సులు)తో శుభారంభాన్ని నమోదు చేశారు.  

పదో ఓవర్లో తొలి వికెట్‌గా విన్స్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌ను అఫ్గన్ బౌలర్లు అదుపుచేయలేకపోయారు. జో రూట్(88; 82బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సు) వీరోచిత ఇన్నింగ్స్‌కు ఇయోన్ మోర్గాన్(148; 71బంతుల్లో 4ఫోర్లు, 17సిక్సులు)మెరుపులాంటి షాట్లతో బౌండరీలే హద్దుగా చెలరేగాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో 148పరుగులతో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఘనత సాధించాడు. 

చివరి ఓవర్లలో 47వ ఓవర్‌కు గులాబ్దీన్ నాయబ్ మోర్గాన్‌ను చేయడంతో ఇంగ్లాండ్ కాస్త నెమ్మెదించింది. ఆ తర్వాత స్వల్ప విరామంతోనే జోస్ బట్లర్(2), బెన్ స్టోక్స్(2)వెనుదిరగడంతో మొయిన్ అలీ(31; 9బంతుల్లో 1ఫోర్, 4సిక్సులు), క్రిస్ వోక్స్(1)ఇన్నింగ్స్ ను ముగించారు. రషీద్ ఖాన్ వికెట్ లేకుండానే ఏకంగా 110 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఓ బౌలర్‌కి అత్యంత చెత్త ప్రదర్శన. 

england
afghanistan
cricket
2019 icc world cup
world cup 2019


మరిన్ని వార్తలు