ఓ శకం ముగిసింది : మాజీ పీఎంలను మిస్ అవుతున్న పార్లమెంట్

Submitted on 16 June 2019
End Of An Era: Parliament To Miss Former PM Dr Manmohan Singh As His 30-year-long Rajya Sabha Term Comes To An End

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం శుక్రవారం(జూన్-15,2019)ముగిసింది.దీంతో ఆయన 30ఏళ్ల రాజకీయ ప్రస్థానం కూడా ఓ రకంగా ముగిసినట్లే అని చెప్పవచ్చు.కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో ఆయనను మరోసారి పెద్దలసభకు పంపే అవకాశం లేదన్నట్లుగా కన్పిస్తోంది. 1991లో అసోం నుంచి తొలిసారిగా మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.1995,2001,2007,2013లో ఆయన తిరిగి రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు.

బీజేపీ అధికారంలో ఉన్న 1998-2004మధ్యకాలంలో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.1999 ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్ సభకు పోటీ చేసి మన్మోహన్ ఓడిపోయారు. సోమవారం(జూన్-17,2019)నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఉండరు.ఒక్క పార్లమెంట్ మాత్రమే కాకుండా యావత్ దేశం ఈ ఆర్థిక నిపుణుడిని మిస్ అవుతోంది.

పీవీ నరసింహరావు సారథ్యంలో ఆర్థికమంత్రిగా మన్మోహన్‌సింగ్‌ రూపొందించి, అమలు చేసిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశగతిని మార్చేశాయి. ప్రస్తుతం దేశ ఆర్థికరంగం ప్రపంచ ఆర్థిక శక్తిగా పరుగులు తీస్తోందంటే దానికి పునాదులు వేసినది మన్మోహనే! ఆరేళ్లపాటు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మన్మోహన్‌- దేశ ఆర్థికరంగాన్ని పూర్తిగా సరళీకరించి ప్రపంచ మార్కెట్లకు తెరిచారు. అనుకోకుండా ఆర్థికమంత్రినే కాదు... ప్రధానిని కూడా ఆయ్యారు మన్మోహన్ సింగ్. 2004 నుంచి 2014 దాకా పదేళ్ల పాటు ఆయన దేశ ప్రధానిగా కొనసాగారు.ఆయన హయాంలో చాలా కుంభకోణాలు జరిగినా ఆర్థికవ్యవస్థ పతనం కాలేదు. ఎన్నడూ వృద్ధి రేటు మందగించలేదు. ప్రపంచ ఆర్థికవ్యవస్థ 2008 కాలంలో మాంద్యాన్ని ఎదుర్కొంటున్నపుడు కూడా మన్మోహన్‌ విధానాలు రక్షణ కవచంగా నిలిచాయి.

మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ కూడా సోమవారం నుంచి జరుగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉండరు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని తుముకూరు నుంచి పోటీ చేసిన దేవెగౌడ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.అంటే ఈసారి పార్లమెంట్ లో మాజీ ప్రధానులు  ఎవ్వరూ ఉండటం లేదు.

manmohan singh
DEVEGOWDA
loksabha
Rajyasabha
parliment
attending
not
term
end
Era
economist
Former
PM
Missing


మరిన్ని వార్తలు