డ్యూటీ టైమ్ లో మందేసి చిందేశారు

Submitted on 17 November 2019
electricity officers Drinking alcohol, dance at duty time

కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో విద్యుత్ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు మద్యం తాగి చిందేశారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్యూటీ టైమ్ లోనే అధికారులు మద్యం పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆల్లగడ్డ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించిన ఏఈలు, లైన్ మెన్లు, కాంట్రాక్టర్లు, ఇతర సిబ్బంది నల్లమల ఫారెస్టులో మద్యం తాగి డ్యాన్స్ లు చేశారు. ఆల్లగడ్డకు సంబంధించిన ఏడీఈ ట్రాన్స్ ఫర్ అయిన సందర్భంగా మందు పార్టీ చేసుకున్నారు. అధికారులంతా కలిసి తాగి చిందేయడంతో పలు విమర్శలకు తావిస్తోంది. విధులు నిర్వర్తించకుండా మందు తాగి డ్యాన్సులు చేసి అలసత్వం ప్రదర్శించారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఫారెస్టులోకి వెళ్లాలంటే అటవీ అధికారుల పర్మీషన్ ఉండాలి. కానీ ఫారెస్టు అధికారులతో ఎలాంటి పర్మీషన్ లేకుండా నల్లమల ఫారెస్టులోకి వెళ్లి మద్యం తాగి, చిందేసినట్లు తెలుస్తోంది. ఏఈలు, లైన్ మెన్లు, కాంట్రాక్టర్లు, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడికి చేరారు. మద్యం సేవిం కేకలు వేస్తూ, డ్యాన్సులు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. 

విద్యుత్ అధికారుల వాట్సాప్, సోషల్ మీడియాలో మందు పార్టీ దృశ్యాలు వైరల్ కావడంతో అధికార యంత్రాంగం దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఎవరైతే డ్యూటీ సమయంలో ఫారెస్టులోకి వెళ్లి మద్యం తాగి, చిందేశారో వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 
 

electricity
Officers
EMPLOYEE
Drink
Alcohol
Dance
duty time
Kurnool
Allagadda
nallamala forest

మరిన్ని వార్తలు