హలో ఈసీ : హెల్ప్ లైన్ 1950 స్పెషల్ అదే

Submitted on 22 March 2019
Election Commission helpline number 1950 is the same as that

ఢిల్లీ : ‘1950’ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం సంస్థలకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లు ఇవ్వటం సర్వసాధారణమే. ఆ నంబర్ల్ వెనుక ఓ కారణం కూడా ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ ‘1950’ నంబర్ కు కూడా ఓ ప్రత్యేకత ఉందండోయ్. అదేమిటంటే...భారత ఎన్నిక సంఘం 1950 జనవరి 25న ఏర్పాటైంది. అందుకే అదే సంవత్సరం నంబర్ ను హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కేటాయించింది ఈసీ. అదన్నమాట అసలు సంగతి!  ఇక పోతే ఏఏ సమాచారం కోసం ఈ నంబర్ కు ఫోన్ చేయవచ్చో తెలుసుకుందాం..
Read Also : నాకేం తక్కువ : రెండు కాళ్లతో నడిచేస్తున్న బుజ్జి మేక

మీ  ఓటు హక్కు గురించి తెలుసుకోవాలనుకుంటే 1950 నంబర్ కు కాల్ చేయండి..మీ అనుమానాలను నివృతి చేసుకోచ్చు. ఎన్నికల్లో మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వారికి..ఓటుకు సంబంధించిన ప్రతీ అనుమానాన్ని తీర్చుకోవటానికి ఈ 1950 నంబర్ ను ఉపయోగపడుతుందని ఈసీ తెలిపింది. ఓటు హక్కుకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా..లేదా ఫిర్యాదు చేయాలన్నా..ఇంకా ఇతరత్రా ఏదైనా సమస్యలు తలెత్తినా..టక్కున 1950 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడంతోపాటు ఓటర్ల అభిప్రాయాలు తీసుకోవడం, సలహాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ కేంద్ర ఎన్నికల  సిబ్బంది చేస్తారు. ఈ నంబర్‌తో ప్రతి జిల్లా కలెక్టరేట్‌లోని కాంటాక్ట్‌ సెంటర్‌ ద్వారా అధికారులు సేవల్నిఅందిస్తారు. 
Read Also : సెల్ఫీ ప్లీజ్ : వామ్మో.. ఎయిర్ పోర్ట్ లో షార్క్.. ప్రయాణీకులు షాక్

Election commission
Help Line
Number
1950
Special

మరిన్ని వార్తలు