ఇదీ మన విద్యా వ్యవస్థ: లక్ష స్కూల్స్ లో.. ఒకరే టీచర్

Submitted on 8 January 2019
Education System In Tatters, Govt Confesses Nearly 1 Lakh Schools Running With Just One Teacher

భారతదేశంలో విద్యావ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో తెలిస్తే నోర్లు వెళ్లబెట్టాల్సిందే. ఒకప్పుడు ప్రపంచదేశాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి భారత్ వచ్చేవారు. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ప్రకారం  భారత్ లోని దాదాపు 1లక్ష ప్రైమరీ, సెకండరీ  స్కూల్స్ లో కేవలం ఒకే ఒక్క టీచర్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారంటూ సోమవారం(జనవరి-8,2019) కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి సత్యపాల్ సింగ్  పార్లమెంట్ కి తెలిపారు.

యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్(UDISE) 2016-17 డేటా ప్రకారం...92 వేల 275 ఎలిమెంట్రీ లెవల్, సెకండరీ లెవల్ గవర్నెంట్ స్కూళ్లు ఒక టీచర్ తో రన్ అవుతున్నాయని సత్యపాల్ ఓ ప్రశ్నకు సమాధారంగా లోక్ సభకు ఈ మేరకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయితే భారత్ లో విద్యావ్యవస్థ పతనమవుతుందని పులువురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపటి భావి భారత పౌరులను మన ప్రభుత్వాలు నిరక్ష్యం చేస్తున్నాయని విద్యావేత్తలు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పాఠశాలలను పట్టించుకోవాలని అన్నారు.
 

india
1LAKH
GOVT SCHOOLS
SINGLE TEACHER

మరిన్ని వార్తలు