ఎదురీత మోషన్ పోస్టర్

Submitted on 19 February 2019
Edhureetha Motion Poster-10TV

విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా మారనున్నాడు.. శ్రవణ్ రాఘవేంద్ర, లియోనా లిషోయ్, మాస్టర్ చరణ్ రామ్ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న సినిమా, ఎదురీత. ఇంతకుముందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్, రీసెంట్‌గా ఎదురీత మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. కొడుకుతో కలిసి స్కూటర్‌పై వెళ్తున్న శ్రవణ్ లుక్ బాగుంది. ఆ తండ్రికి కొడుకంటే చాలా ఇష్టం.. కొడుకు కోరిన కోరిక ఏదైనా కానీ, క్షణాల్లో నెరవేరుస్తుంటాడు. అమితమైన ఆ ప్రేమే అనుకోకుండా తండ్రిని చిక్కుల్లో పడేస్తే, వాటినుండి బయటపడడానికి ఆ తండ్రి ఏం చేసాడు అనే కథాంశంతో ఎదురీత రూపొందుతుంది..

శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, బోగారి లక్ష్మీ నారాయణ నిర్మిస్తుండగా, తమిళ డైరెక్టర్ విజయ్ విల్టన్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బాల మురగన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తండ్రి, కొడుకుల సెంటిమెంట్ హైలెట్‌గా తెరకెక్కుతున్న ఎదురీత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు.  మార్చి నెలలో సినిమా విడుదల కానుంది. జియా శర్మ, నోయల్ సేన్, 30 ఇయర్స్ పృథ్వీ, మహేష్ ఆచంట, కాశీ విశ్వనాథ్, రవి ప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ సినమాకి రచన : ధనేష్ నెడుమారన్, కెమెరా : విజయ్ ఆర్పుదరాజ్, ఎడిటింగ్ : నగూరన్ రామచంద్రన్.

వాచ్ మోషన్ పోస్టర్...

  

Sravan Raghavendra
Leona Lishoy
Bogari Lakshmi Narayana
Bala Murugan

మరిన్ని వార్తలు