మోదీ వెబ్ సిరీస్ బ్యాన్ చేసిన ఈసీ

Submitted on 20 April 2019
EC Bans Web Series 'Modi-Journey of a Common Man'-10TV

బయోపిక్‌ల ట్రెండ్‌ని కొనసాగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా 'పిఎమ్ నరేంద్రమోదీ' పేరుతో ఒక సినిమా తెరకెక్కింది. నరేంద్రమోదీ బయోపిక్‌లో, ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, నరేంద్ర మోదీగా నటిస్తున్నాడు. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, సురేష్ ఒబెరాయ్, సందీప్ ఎస్‌సింగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా విడుదల విషయంలో ఎలక్షన్ కమీషన్ మూవీ యూనిట్‌కి ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే..
Also Read : టీడీపీ నేత సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య

ఇదిలా ఉంటే మోదీ : ది జర్నీ ఆఫ్ ఎ కామన్ మెన్ పేరుతో బాలీవుడ్‌లో ఒక వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఉమేష్ శుక్లా డైరెక్ట్ చేసాడు. త్వరలో ఈరోస్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల యూట్యూబ్‌లో కనబడక పోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌ని ఎలక్షన్ కమీషన్ (ఈసీ) బ్యాన్ చేసింది. ఎన్నికల వేళ, రకరకాల రాజకీయ రగడలు, ప్రతిపక్షాల విమర్శలు వంటివి పరిగణలోకి తీసుకున్న ఈసీ, మోదీ వెబ్ సిరీస్‌ని బ్యాన్ చేసినట్టు ప్రకటించింది. 
Also Read : షెడ్యూల్ విడుదల : మే 6, 10, 14 తేదీల్లో స్థానిక ఎన్నికలు

PM Narendra Modi
Narendra Modi Biopic
Narendra Modi Web Series

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు