న్యూజిలాండ్‌లో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదు

Submitted on 16 June 2019
Earthquake in New Zealand

న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఈశాన్యంలో ఉన్న కెర్మిడిక్ ద్వీపాల్లో ఆదివారం (జూన్ 16, 2019) ఉదయం ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. భూమికి 10 కి.మీ లోపల భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. 

భూకంప పరిస్థితులను పరీక్షిస్తున్నట్లు న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ ఆర్గనరైజేషన్ తెలిపింది. భూకంప కేంద్రం నుంచి దాదాపు 300 కి.మీ వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని ‘పసిఫిక్‌ సునామీ సెంటర్‌’ తొలుత హెచ్చరికలు జారీ చేసింది. కానీ ప్రకంపనల తీవ్రత పెద్దగా లేదని గుర్తించిన అనంతరం సునామీ హెచ్చరికల్ని రద్దు చేశారు. దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.  

ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక మీడియా తెలిపింది. పసిఫిక్ తీరంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్‌లో తరచూ భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.
 

earthquake
new zealand
Intensity
Richter Scale

మరిన్ని వార్తలు